తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు కేసీఆర్‌కు ఆహ్వానం
గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి ఆహ్వాన పత్రాలు అందించిన మంత్రి పొన్నం ప్రభాకర్
హైదరాబాద్, డిసెంబర్ 7 (విజయక్రాం తి): సచివాలయంలో సోమవారం నిర్వహించనున్న తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, కేం ద్ర మంత్రి కిషన్‌రెడ్డి, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌ను ప్రభుత్వం ఆహ్వానించింది.
మంత్రి పొన్నం ప్రభాకర్ శనివారం రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను, దిల్‌కుష గెస్ట్‌హౌస్‌లో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిని కలిసి ఆహ్వాన పత్రాలు అందజేశారు. అనంతరం ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో మంత్రి పొన్నం, ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్, డిపార్ట్‌మెంట్ ఆఫ్ ప్రొటోకాల్ డైరెక్టర్ వెంకట్రావుతో కలిసి బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌ను కలిశారు.
పొన్నంకు బీఆర్‌ఎస్ నేతల స్వాగతం
ఫామ్‌హౌస్‌కు వచ్చిన మంత్రి పొన్నం ప్రభాకర్‌కు మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్‌కుమార్, మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి స్వాగ తం పలికారు. అనంతరం కేసీఆర్ వారికి ఆతిథ్యమిచ్చి గౌరవించారు. అనంతరం మంత్రి పొన్నం మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పాటులో భాగస్వాములైనవా రిని గౌరవించుకుంటామన్నారు.
సచివాల యంలో సోమవారం తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ ఉందని.. గవర్నర్ జిష్టుదేశ్ వర్మ, కిషన్‌రెడ్డి, ప్రతిపక్షనేత కేసీఆర్‌ను ఆహ్వానించామని చెప్పారు. ఇది రాజకీయా లు మాట్లాడాల్సిన సమయం కాదని, ప్రభుత్వపరమైన కార్యక్రమం కోసమే కేసీఆర్‌ను కలిశామన్నారు. ఈ కార్యక్రమానికి కేసీఆర్ వస్తారని ఆశిస్తున్నట్టు పేర్కొన్నారు.




