08-07-2025 12:37:29 PM
హైదరాబాద్: పాతబస్తీలోని సిటీ సివిల్ కోర్టుకు బాంబు బెదిరింపు కలకలం రేపింది. మంగళవారం సిటీ సివిల్ కోర్టులో బాంబు పెట్టినట్లు గుర్తు తెలియని దుండగుడు బెదింపు కాల్ చేశాడు. దీంతో చీఫ్ మెజిస్ట్రేట్ కోర్టు మూసేసి తనిఖీలకు అనుమతి ఇవ్వడంతో అప్రమాతమై అధికారుల వెంటనే కోర్టులో ఉన్న లాయర్లు, ప్రజలను పోలీసులు బయటకు పంపించారు. డాగ్‌స్వ్కాడ్, బాంబు స్వ్కాడ్‌లతో తనిఖీలు చేశారు. ఈ బాంబు బెదిరింపు కాల్ లో కోర్టు కార్యకలాపాలు నిలిపిచిపోయ్యాయి.