08-07-2025 12:51:36 PM
సంస్థాన్ నారాయణపూర్,(విజయక్రాంతి): పేద ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేసి అందరి మనసుల్లో చెరగని ముద్ర వేసిన మహనీయుడు డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి అని నారాయణపూర్ కాంగ్రెస్ నాయకులు అన్నారు. సంస్థాన్ నారాయణపూర్ మండల కేంద్రంలో దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 76వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.
వైఎస్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ లాంటి పథకం ద్వారా పేద ప్రజలకు కూడా కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని అందించారని ఇప్పటికీ ఆరోగ్యశ్రీ సేవలు అందుబాటులో ఉండడం వైఎస్ పుణ్యమేనని అన్నారు. ప్రజల పక్షాన నిలిచి ఎన్నో సంక్షేమ పథకాలను ప్రజల ముంగిట నిలిపిన వైఎస్ లాంటి నేతలు చరిత్రలో అరుదుగా ఉంటారని కొనియాడారు. అనంతరం పండ్లు పంపిణీ చేశారు.