calender_icon.png 8 July, 2025 | 7:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేటీఆర్‌పై ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ సంచలన వ్యాఖ్యలు

08-07-2025 01:22:31 PM

  1. అధికారంలో ఉన్నా లేకున్నా.. బీఆర్ఎస్ లో ఆ నలుగురే కనిపిస్తారు.
  2. బీఆర్ఎస్ పార్టీలో  నలుగురు తప్ప.. ఇంకెవరైనా ఉన్నారా?
  3. తెలంగాణను నట్టేట ముంచిందే బీఆర్ఎస్: అద్దంకి దయాకర్

హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌ వేదికగా వేదికగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR) చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్(MLC Addanki Dayakar) సీఎల్పీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో కౌంటర్ ఇచ్చారు. ఏడాదిన్నరలో రైతుల ఖాతాల్లోనే రూ. 50 వేల కోట్లు వేశామని చెప్పారు. నిరంకుశంగా వ్యవహరించింది ఎవరో.. కేటీఆర్ గుర్తుతెచ్చుకోవాలని హెచ్చరించారు. హరీశ్ రావు, కేటీఆర్, కవిత మధ్య పోటీ నెలకొన్నదని అద్దంకి దయాకర్ చెప్పారు. హరీశ్ రావు, కవిత దూసుకుపోతుంటే వెనకబడ్డాను అనే భావనలో కేటీఆర్ ఉన్నారని ఆయన సూచించారు. హరీశ్ రావు, కవిత మధ్య ఉనికి చాటుకునేందుకు కేటీఆర్ ప్రయత్నిస్తున్నారని కీలక వ్యాఖ్యలు చేశారు.

బీఆర్ఎస్ పార్టీలో నలుగురు తప్ప.. ఇంకెవరైనా ఉన్నారా? అధికారంలో ఉన్నా.. లేకున్నా.. బీఆర్ఎస్(Bharat Rashtra Samithi) పార్టీలో నలుగురే కనిపిస్తారని అద్దంకి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీలో మాత్రం అందరికీ అవకాశాలు ఉంటాయి.. అందరికీ ప్రాధాన్యం ఉంటుందని చెప్పారు. తెలంగాణను నట్టేట ముందిందే బీఆర్ఎస్ అని అద్దంకి దయాకర్ స్పష్టం చేశారు. పార్టీ పేరులోనే తెలంగాణ ఉండటం ఇష్టం లేక.. బీఆర్ఎస్ అని మార్చుకున్నారని విమర్శించారు. మీడియాలో కూడా ఆంధ్ర, తెలంగాణ అనే విద్వేషాలు రెచ్చగొడుతున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. అనుకూలంగా రాయలేదని మీడియాలో విద్వేషాలు రెచ్చగొడతారా?, బేసిన్లు, బేషజాలు లేకుండా ఏపీ కూడా నీళ్లు తీసుకోవాలని మాట్లాడలేదా?