08-07-2025 12:53:15 PM
హైదరాబాద్: మాట ఇచ్చినట్లే సీఎం రేవంత్ రెడ్డి రుణమాఫీ చేశారని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి(Parigi MLA Ram Mohan Reddy) అన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీకి చేరుకున్నారు. అసెంబ్లీ వేదికగానే సంక్షేమంపై చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. మీ నాయకుడు కేసీఆర్(Kalvakuntla Chandrashekar Rao) లేఖ ఇస్తే అసెంబ్లీ పెట్టడానికి మేము సిద్ధమని సవాల్ విసిరారు. అసెంబ్లీ ఎప్పుడు పెట్టాలో చెప్తే.. మేము సిద్ధంగా ఉన్నామని రామ్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలను ఈ ప్రభుత్వం నెరవేరుస్తోందని ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి తేల్చిచెప్పారు. నాలుక చీరేస్తానంటూ సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు(Siddipet BRS MLA Harish Rao) ఎక్కువ మాట్లాడుతున్నారని రామ్మోహన్ రెడ్డి మండిపడ్డారు. రాయలసీమకు బీఆర్ఎస్ ఇచ్చిన మాటలు కూడా చర్చకు పెడదామని కాంగ్రెస్ నేతలు పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి సవాల్ మేరకు సోమాజీగూడ ప్రెస్ క్లబ్ కి వెళ్లిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాష్ట్రంలో మోసపూరిత పాలన నడుస్తుందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను, మహిళలను మోసం చేస్తుందన్నారు. 18 నెలలుగా కాంగ్రెస్ అరాచకాలను ఎండగడుతున్నామని కేటీఆర్ పేర్కొన్నారు.