calender_icon.png 8 July, 2025 | 8:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆర్టిజన్ కార్మికుల సమ్మెను జయప్రదం చేయండి

08-07-2025 12:47:37 PM

టీవీ ఏసి జేఏసీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ముసి గుంపుల యాకయ్య

తుంగతుర్తి,(విజయక్రాంతి): ఈనెల 14 నుంచి చేపట్టనున్న విద్యుత్ ఆర్టిజన్ కార్మికుల సమ్మె(Electrical Artisan Workers Strike)ను జయప్రదం చేయాలని టీవీఏసీ జేఏసీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ముసిగుంపుల యాకయ్య(TVAC JAC District Working President Musigumpula Yakaiah), సబ్ డివిజన్ అధ్యక్షుడు అండెం రమేష్ గౌడ్(Sub-Division President Andem Ramesh Goud) లు పిలుపునిచ్చారు. మంగళవారం మండల కేంద్రంలోని విద్యుత్ సబ్ స్టేషన్ లో సమ్మె గోడపత్రికను ఆవిష్కరించి మాట్లాడారు. ఒకే వ్యవస్థలో రెండు రూల్స్ రావడం తీసుకురావడం అన్యాయమని, స్టాడింగ్ ఆర్డర్స్ ను రద్దుచేసి ఏపీఎస్ఈబీ రూల్స్ వర్తింపజేయాలని ప్రభుత్వానికి కోరారు.

కన్వర్షన్ అనేది ఉద్యోగ భద్రత, ఆత్మగౌరానికి సంబంధించిన అత్యంత కీలకమైన డిమాండ్ అని, గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్టిజన్ అని ఓ ముద్దు పేరు పెట్టి కార్మికులను నట్టేట ముంచి పోయిందని, కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఆర్టిజన్ కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. యూనియన్ లతో సంబంధం లేకుండా సమ్మెలో పాల్గొని జయప్రదం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు నీలం సైదులు, సోషల్ మీడియా ఇంఛార్జ్ కొమ్ము లింగమూర్తి, మల్లేష్, వెంకన్న, జి.వెంకన్న, ఎల్లయ్య, ధనమ్మ, అంకుష్ తదితరులు పాల్గొన్నారు.