calender_icon.png 8 July, 2025 | 8:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png
Breaking News

దివంగత డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి 76వ జయంతి వేడుకలు

08-07-2025 12:26:21 PM

అనంతగిరి: అనంతగిరి మండల పరిధిలోని వాయిలసింగవరం గ్రామంలో మంగళవారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి 76 వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సంధర్భంగా దివంగత రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి సూర్యాపేట జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు వెంపటి వెంకటేశ్వరరావు పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

అనంతరం  ఆయన మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ పధకం 108 అత్యవసర వాహన సేవ, 104 ఆరోగ్య సేవలు, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్, వితంతు వృద్ధాప్య, వికలాంగుల పెన్షన్లు వంటి పథకాలు ప్రజల జీవితాల్లో చెరగని ముద్ర వేశాయని ముఖ్యంగా ఆరోగ్య రంగంలో ఆరోగ్యశ్రీ పథకం దేశానికి ఆదర్శంగా నిలిచింది అని  కొనియాడారు దివంగత రాజశేఖర్ రెడ్డి ని ఆదర్శంగా తీసుకొని యువత ముందుకు నడవాలని సూచించారు.