10 April, 2026 | 5:15 AM

హ్యాట్రిక్ కొట్టిన కేరళ

20-12-2024 12:00 AM

మేఘాలయకు తొలి గెలుపు సంతోష్ ట్రోఫీ

హైదరాబాద్: దేశవాలీ టోర్నీ సంతోష్ ట్రోఫీలో భాగంగా కేరళ వరుసగా మూడో విజయాన్ని అందుకుంది. హైదరాబాద్ వేదికగా గ్రూప్ తొలి మ్యాచ్‌లో కేరళ 2 ఒడిశాపై గెలుపును నమోదు చేసుకుంది. కేరళ తరఫున ముహమ్మద్ అసల్ (ఆట 41వ నిమిషం), నసీబ్ రహమాన్ (54వ ని.లో) గోల్స్ సాధించారు. ఈ ఓటమితో ఒడిశా కేవలం ఒక విజయంతో నాలుగో స్థానానికి పడిపోయింది. టోర్నీలో హ్యాట్రిక్ విజయాన్ని అందుకున్న కేరళ తొమ్మిది పాయింట్లతో పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లింది. ఇక మేఘాలయా టోర్నీలో తొలి విజయాన్ని అందుకుంది. ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో మేఘాలయా 2 గెలుపొందింది. మేఘాలయా తరఫున డొనాల్డ్ డీంగో డబుల్ గోల్స్‌తో మెరిశాడు. సీజన్‌లో ఢిల్లీకి ఇదే తొలి ఓటమి కాగా పట్టికలో రెండో స్థానంలో ఉంది.