17 March, 2026 | 3:18 AM

ఎంపీ వేం నరేందర్ రెడ్డిని కలిసిన కేసముద్రం మున్సిపల్ చైర్‌పర్సన్

17-03-2026 02:08 AM

కేసముద్రం, మార్చి 16 (విజయక్రాంతి): రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన వేం నరేందర్ రెడ్డిని కేసముద్రం మున్సిపాలిటీ చైర్ పర్సన్ బానోతు సునీత వెంకన్న దంపతులు మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా ఎంపీ వేం నరేందర్ రెడ్డి మాట్లాడుతూ నూతనంగా ఏర్పాటైన కేసముద్రం మున్సిపాలిటీ తొలి చైర్ పర్సన్ గా ఎన్నికైన నేపథ్యంలో పట్టణ అభివృద్ధికి  పాటుపడాలని, ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేయడంలో కీలకపాత్ర వహించాలని సూచించారు.