రామప్పను సందర్శించిన జర్మనీ దేశస్తులు
వెంకటాపూర్, మార్చి 16 (విజయక్రాంతి): మండలంలోని ప్రపంచ వారసత్వ కట్టడం రామప్ప దేవాలయాన్ని సోమవారం జర్మనీ దేశానికి చెందిన పర్యాటకులు మిచెల్, లుడ్విగ్ సందర్శించారు. ఆలయానికి చేరుకున్న వారికి ఆలయ అర్చకులు స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అర్చకులు హరీష్ శర్మ, ఉమాశంకర్ వారికి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా రామప్ప దేవాలయ చరిత్ర, కాకతీయుల కాలానికి చెందిన శిల్పకళ ప్రత్యేకతలను టూరిజం గైడ్ గోరంట్ల విజయ్ కుమార్ వారికి వివరించారు.
ఆలయంలోని శిల్పాలు, నిర్మాణ శైలి ఎంతో అద్భుతంగా ఉన్నాయని జర్మనీ పర్యాటకులు ప్రశంసించారు. ఇలాంటి అద్భుతమైన కళాఖండాన్ని ప్రత్యక్షంగా చూడటం చాలా ఆనందంగా ఉందని వారు తెలిపారు. అనంతరం వారు రామప్ప చెరువును సందర్శించి బోటింగ్ చేశారు. వారి వెంట టూరిస్ట్ పోలీసులు శ్రీనివాస్, బద్రు, పురావస్తు శాఖ మరియు దేవాదాయ శాఖ సిబ్బంది ఉన్నారు.




