calender_icon.png 26 December, 2025 | 1:40 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేసీఆర్ కీలక సమావేశం

26-12-2025 11:55:29 AM

హైదరాబాద్: మాజీ సీఎం, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు(Kalvakuntla Chandrashekar Rao) శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు ఎర్రవల్లి నివాసంలో కీలక సమావేశం నిర్వహించనున్నారు. బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రులతో కేసీఆర్ శుక్రవారం సమావేశం కానున్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్, నల్గొండ, ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల మాజీ మంత్రులతో కేసీఆర్ భేటీ కానున్నారు. నాలుగు ఉమ్మడి జిల్లాల నేతల సమావేశంలో కేటీఆర్, హరీశ్ రావు పాల్గొనున్నారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, ప్రజల్లోకి తీసుకెళ్లేలా చేపట్టాల్సిన కార్యక్రమాలు, బహిరంగ సభలు, అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహం, లేవనెత్తాల్సిన అంశాలపై కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు.