calender_icon.png 21 October, 2025 | 8:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మాజీ డీజీపీ కొడుకు మృతి కేసు కీలక మలుపు

21-10-2025 05:43:36 PM

చండీగఢ్: పంచకులలోని తన ఇంట్లో అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందిన పంజాబ్ మాజీ డీజీపీ కుమారుడు అఖీల్ అఖ్తర్ మృతి ఘటన ప్రస్తుతం సంచలన సృష్టిస్తుంది.  మాజీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ మహ్మద్ ముస్తఫా, పంజాబ్ మాజీ మంత్రి, కాంగ్రెస్ నాయకురాలు రజియా సుల్తానా కుమారుడు అఖిల్ అక్తర్ ఒక వీడియోలో తన తండ్రికి తన భార్యతో అక్రమ సంబంధం ఉందని, తన మరణానికి కొన్ని రోజుల ముందు తన హత్యకు కుట్ర పన్నాడని ఆరోపించాడు. తనను తప్పుడు నిర్బంధంలో ఉంచారని, పునరావాస కేంద్రానికి పంపారని, దీంతో తన వ్యాపార ఆదాయాన్ని కోల్పోయారని అఖీల్ ఆరోపించారు.

మానసిక, శారీరక వేధింపులు, తనపై తప్పుడు కేసుల బెదిరింపులను కూడా ఆయన వివరించారు. పంజాబ్ మాజీ డీజీపీ (మానవ హక్కులు) మహ్మద్ ముస్తఫా కుమారుడు (33) ఏళ్ల అకీల్ వీడియోను వారి పొరుగువాడ షంషుద్దీన్ చౌదరి పోలీసులకు సమర్పించారు, ఈ విషయంపై వివరణాత్మక దర్యాప్తు కోరుతూ ఆయన అధికారికంగా ఫిర్యాదు కూడా చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... అఖీల్ అక్టోబర్ 16న పంచకులలోని తన ఇంట్లో అపస్మారక స్థితిలో ఉన్నట్లు గుర్తించిన అతని కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మరణించడాన్ని వైద్యులు వెల్లడించారు. తరువాత వారు డ్రగ్ అధిక మోతాదు వల్లే మరణించాడని పేర్కొన్నారు. అయితే, షంషుద్దీన్ చౌదరి చేసిన ఫిర్యాదు. ఆగస్టు 27న అకీల్ రికార్డ్ చేసిన 16 నిమిషాల వీడియో దుష్ప్రవర్తనకు సంబంధించిన తీవ్రమైన అనుమానాలను లేవనెత్తాయి.

ఆ విడియోలో మృతుడు తన వివాహం నుండి తాను అనుభవిస్తున్న బాధను వివరించాడు. 2018లో తన తండ్, భార్య మధ్య సంబంధాన్ని కనుగొన్నానని, తన తల్లి, సోదరి తనను చంపడానికి కుట్ర పన్నుతున్నట్లు విన్నానని కూడా అతను వెల్లడించాడు.  అఖీల్ వీడియో తన ప్రాణానికి ప్రమాదం ఉందని స్పష్టమైన హెచ్చరికగా పేర్కొంటూ, అనుమానాస్పద మరణంపై దర్యాప్తు చేయాలని షంషుద్దీన్ అధికారులను కోరారు. అఖీల్ సోషల్ మీడియా పోస్టులు, డిజిటల్ ఆధారాలు, కాల్ రికార్డులు, పోస్ట్‌మార్టం నివేదిక, న్యాయం జరిగేలా కుటుంబ సభ్యులు, సహచరుల ప్రమేయం ఉన్నాయో లేదో క్షుణ్ణంగా పరిశీలించాలని ఫిర్యాదులో కోరారు.