calender_icon.png 21 October, 2025 | 10:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో ప్రజా బాట..

21-10-2025 07:48:32 PM

చిట్యాల (విజయక్రాంతి): విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో చిట్యాల పట్టణం 9వ వార్డులో ప్రజా బాట కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు నకిరేకల్ శాసనసభ్యుడు వేముల వీరేశం సూచనతో విద్యుత్ శాఖలో ప్రజా బాట కార్యక్రమం చిట్యాల పట్టణంలోని తొమ్మిదో వార్డులో విద్యుత్ శాఖ ఏఈ రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ప్రజా బాట కార్యక్రమంలో భాగంగా విద్యుత్ ట్రాన్స్ఫార్మర్స్ మెయింటెనెన్స్, వార్డుల్లో విరిగిన విద్యుత్ స్తంభాల స్థానం లో నూతన స్తంభాల ఏర్పాటు, వేలాడే తీగలను, ట్రాన్స్ఫార్మర్ల రిపేరింగ్  ఉన్నటువంటి వాటిని సరి చేయించారు. మాజీ కౌన్సిలర్ బెల్లి సత్తయ్య అధికారుల వెంటే ఉండి వార్డులో ఉన్న విద్యుత్ సమస్యలను దగ్గరుండి పరిష్కరించారు. ఇలాంటి కార్యక్రమాలు చేయడం వలన విద్యుత్ అంతరాయం చాలా వరకు తగ్గించవచ్చని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ సిబ్బంది వార్డు ప్రజలు పాల్గొన్నారు.