21-10-2025 08:22:05 PM
జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వన్
కామారెడ్డి (విజయక్రాంతి): పత్తి రైతులు సీసీఐలో పత్తి అమ్ముకొనుటకు ముందుగా కాపాస్ కిసాన్ ఆప్ తమ సెల్ ఫోన్ లో డౌన్లోడ్ చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగువాన్ తెలిపారు. ముందుగా రైతు నమోదు చేసుకోని, తర్వాత స్లాట్ బుకింగ్ చేసుకోవాలన్నారు. జిల్లాలోని మద్నూర్ లో గల జిన్నింగ్ మిల్లు కృష్ణా నాచురల్ ఫైబర్ జిన్నింగ్ మిల్లును ముందుగా సిసిఐ వారు ఎల్ 1 లో ఎన్నుకున్నట్లు తెలిపారు. ఈ జిన్నింగ్ మిల్లు మాత్రమే కనబడుతుందన్నారు. రైతులు స్లాట్ బుకింగ్ చేసి ఏ రోజు అనేది తేదీ పైన క్లిక్ చేస్తే ఆమోదం వస్తుందన్నారు. ఒక వేళ రైతులు ఫ్లాట్ బుక్ చేసుకొని యెడల ఆ గ్రామం ఏ ఈ ఓల వద్దకు గానీ, మండల వ్యవసాయ అధికారుల వద్దకు లేదా జిల్లాలోని ఏ మార్కెట్ కమిటీ కార్యాలయాల వద్దకు వెళ్ళిన స్లాట్ బుకింగ్ చేసి ఇస్తారని తెలిపారు.
దీనికి స్మార్ట్ ఫోన్ ఉండాలన్నారు. స్మార్ట్ ఫోన్ లేని యెడల సంబంధిత అధికారులు వద్దకు వెళ్తే రైతులకు ఓటిపి వస్తుంది. దానిని రైతులు అధికారులకు చెప్పిన యెడల వారు స్లాట్ బుకింగ్ చేస్తారు. రైతులకు మెసేజ్ రూపంలో ఆమోదం వస్తుందన్నారు. స్లాట్ బుకింగ్ లేకుండా సిసిఐ లో అమ్ముకోవడానికి వీలు లేదన్నారు. పత్తి రైతులు సిసిఐలో అమ్ముకోవడానికి స్లాట్ బుకింగ్ చేసుక వాలన్నారు. 8% మాత్రమే తేమ ఉండేవిధంగా మంచిగా అరబెట్టుకుని రూ.8110/-ఎం ఎస్ పి ధర రైతులు పొందాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ తెలిపారు.