calender_icon.png 21 October, 2025 | 10:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎస్సార్పీ ఓసీ బీఎంఎస్ ఫిట్ సెక్రటరీగా నాగార్జున నాయక్

21-10-2025 07:51:21 PM

నస్పూర్, (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లాలోని శ్రీరాంపూర్ ఓపెన్ కాస్టు (OC) నూతన పిట్ కార్యదర్శిగా కొర్ర నాగార్జున నాయక్ ను నియమిస్తున్నట్లు సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘ్ (BMS) శ్రీరాంపూర్ ఏరియా ఉపాధ్యక్షులు నాతాడి శ్రీధర్ రెడ్డి మంగళ వారం ప్రకటించారు. మంగళ వారం నిర్వహించిన శ్రీరాంపూర్ ఏరియా, శ్రీరాంపూర్ ఓపెన్ కాస్ట్ కమిటీ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై కార్మిక సమస్యలపై మాట్లాడి నియామక పత్రాన్ని నాగార్జున నాయక్ కు అందజేశారు. 

పదవులు కార్మికులకు సేవ చేయడానికే గాని ఆధిపత్యం చలాయించడానికి కాదని, సంస్థ పరిరక్షణతో పాటు కార్మికుల సంక్షేమానికి పాటుపడాలని సూచించారు. అనంతరం కొర్ర నాగార్జున నాయక్ ను శ్రీరాంపూర్ ఓసీ ఫిట్ సెక్రటరీగా నియమించినట్లు నియామక పత్రాన్ని శ్రీరాంపూర్ ఓపెన్ కాస్ట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ వెంకటేశ్వర్లు కి అందజేశారు. ఏరియా కార్యదర్శి రాగం రాజేందర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో సెంట్రల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఐలవేణి శ్రీనివాస్, శ్రీరాంపూర్ ఏరియా ఆర్గనైజింగ్ సెక్రెటరీ జిల్లా తిరుపతి, రాజా రామ్ కిరణ్, బోడకుంట శ్రీధర్, కుంట రాజు, చొప్పరి శ్రీకాంత్, వెంకటరమణ  తదితరులు పాల్గొన్నారు.