calender_icon.png 21 October, 2025 | 10:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అనాధ టపాకాయలు పంపిణీ

21-10-2025 07:43:39 PM

చిన్నారులతో దీపావళి సంబరాలు జరిపిన ప్రిథ్వీరాజ్..

పటాన్‌చెరు: ఎండిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గత నాలుగు సంవత్సరాలుగా ప్రతి దీపావళి పండుగ రోజు చిన్నారులకు ఆనందం పంచుతూ వస్తున్న ప్రిథ్వీరాజ్, ఈ సంవత్సరం కూడా అదే ఆనందాన్ని పునరావృతం చేశారు. పటాన్‌చెరు నియోజకవర్గంలోని బొల్లారంలోని డిజైర్ సొసైటీలో ఉంటున్న అనాధ చిన్నారులకు టపాకాయలు పంపిణీ చేస్తూ, వారు ఉత్సాహంగా పండుగను జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఎండిఆర్ ఫౌండేషన్ ద్వారా ప్రతి సంవత్సరం నిర్వహించబడే ఈ కార్యక్రమాలు సమాజంలో ఆనందం, సానుకూలతను పెంపొందించడంలో సహాయపడుతున్నాయి. ఈ సందర్భంగా ప్రిథ్వీరాజ్ మాట్లాడుతూ... చిన్నారుల చిరునవ్వుకన్నా విలువైనది ఏమీ లేదు. వారి ఆనందం నాకు దీపావళి వెలుగుల్లా అనిపిస్తుంది అని చెప్పారు. చిన్నారులు హర్షంతో ప్రిథ్వీరాజ్ కి హ్యాపీ దీపావళి‌, కృతజ్ఞతలు తెలిపారు. ఎన్ డి ఆర్ ఫౌండేషన్ వెలుగులు పంచే చేతులు, చిరునవ్వులు సృష్టించే మనసులు.