calender_icon.png 4 July, 2025 | 4:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేజీబీవీలు కిటకిట.. సిబ్బందికి కటకట

03-07-2025 01:12:28 AM

- లక్ష్యం కంటే విద్యార్థులు ఎక్కువ

- మౌలిక సదుపాయాలు కల్పనలో తీవ్ర ఇబ్బందులు

- తనిఖీల పేరుతో హడలెత్తిస్తున్న అధికారులు 

నిర్మల్, జూలై 2(విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో పేదరికంలో ఉన్న పిల్లల కోసం సర్వ శిక్ష అభియాన్ కింద ఏర్పాటు చేసిన కేజీబీవీ విద్యాసంస్థల్లో అడ్మిషన్లు వరదల్లో వచ్చి పడుతున్నాయి. నిర్మల్ జిల్లాలో మొ త్తం 19 కేజీబీవీ ఉన్నాయి. ఈ పాఠశాలలో ఆరో తరగతి నుంచి ఇంటర్ వరకు ప్రవేశా లు కల్పిస్తున్నారు. 6 నుంచి 10 తరగతి వర కు ఉన్న పాఠశాలలో 240 మంది ఇంటర్ వరకు ఉన్న కేజీబీవీలో 340 మంది విద్యార్థులను చేర్చుకోవాల్సిన నిబంధన ఉన్న జిల్లా వ్యాప్తంగా ఈ విద్యాసంస్థల్లో ఆడపిల్లలను చదివించేందుకు తల్లిదండ్రులు పోటీ పడుతున్నారు.

ప్రతి తరగతిలో 40 మంది విద్యార్థులు మాత్రమే చేసుకోవలసి ఉండగా స్థానికంగా ఉన్న పోటీ నేపథ్యంలో ఒక్కొక్క క్లాసులో 50 నుంచి 70 మంది వరకు విద్యార్థులు చదువుతున్నట్టు కేజీబీవీఎస్‌ఓ లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న కేజీబీవీలకు ప్రభుత్వ భవనాలు ఉన్నప్పటికీ అం దులో 240 మంది పాఠశాల స్థాయిలో 3 60 మంది కళాశాల స్థాయిలో వసతులు కల్పించవలసి ఉన్న పరిమితికి మించి విద్యార్థులు అడ్మిషన్లు తీసుకోవడంతో కేజీబీవీలు విద్యార్థులతో కటకటలాడుతున్నాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఐదవ తరగతి పాసైన బాలికలందరినీ గురుకులాల్లో రీయంట్రీ పరీక్ష రాయించిన అక్కడ సీట్లు తక్కువగా ఉండటంతో తిరిగి కేజీబీవీ వైపు మొగ్గు చూపుతున్నట్టు కేజీబీవీ ఉపాధ్యాయులు తెలిపారు.

అడ్మిషన్లు ఫుల్.. వసతులు నీల్

జిల్లాలోని కేజీబీవీ పాఠశాలలో గత రెం డేళ్లుగా విద్యార్థుల అడ్మిషన్ల జోరుగా సాగుతున్నాయి. కేజీబీవీ పాఠశాలలో ఆడపిల్లల కు రక్షణగా ఉండడం, మంచి చదువు అం దించడం పోషక విలువలు ఆహారం ప్రతిరోజు వ్యాయామం ఆటలు ఇతర సామాజిక అంశాలపై ఆడపిల్లలకు విద్య అందించడం తో సీనియర్ విద్యార్థులు జూనియర్ విద్యార్థులకు కేజీబీల వైపు మొగ్గు చూపేలా ప్రోత్స హిస్తున్నారు. ఈ పాఠశాలలో చేర్చే పిల్లల్లో తల్లిదండ్రులు లేని వారు ఆర్థికంగా పేదరికం లో ఉన్నవారు కార్మికుల పిల్లలు వ్యవసాయ కూలీల పిల్లలు ప్రాధాన్యత క్రమంలో చేర్పిం చు కోవలసి ఉన్న స్థానిక నేతల ఒత్తిళ్లు రాజకీయ పైరవీలు అధికారుల సూచనలు కారణంగా వేరే పిల్లలు కూడా చేర్చుకోవాల్సి వస్తుందని ఎస్వోలు వాపోతున్నారు.

ఈ సం వత్సరం ఆరవ తరగతిలో ప్రవేశాల కోసం ప్రతి క్లాసులో 40 మంది విద్యార్థులను మాత్రమే తీసుకోవాల్సి ఉన్న మెజార్టీ కేజీబీవీలో 60 నుంచి 70 వరకు అడ్మిషన్లు నిర్వ హించగా మరో 20 మంది వెయిటింగ్‌లో ఉన్నట్లు కేజీబీవీ పాఠశాలల నిర్వహకులు తెలిపారు. కేజీబీవీలో విద్యాబోధన అవసరమయ్యే తరగతి గదులు బెంచీలు మరుగు దొడ్లు స్నానపు గదుల కొడతా డైనింగ్ హాల్ కొత్త కారణంగా విద్యార్థులు దశలవారీగా భోజనం చేస్తున్నారు. పాఠశాల భవనాలు కొన్ని కొత్తవి కాగా పాత భవనాలు నిర్వహిస్తున్నావుగా అవి వర్షాలకు కురుస్తూ విద్యా ర్థులు చదువుకో ఆటంకం కలిగిస్తున్నాయి. ఇప్పటికే అన్ని కేజీబీవీ పాఠశాలలో అడ్మిషన్లు క్లోజ్ అని నోటీసు బోర్డులు అందించా రు అయినా తమ పిల్లలను చేర్చుకోవాలని తల్లిదండ్రులు ఇంకా పాఠశాల చుట్టూ తిరుగుతున్నారు. 

సిబ్బందిపై తీవ్ర ఒత్తిడి

కేజీబీవీ పాఠశాలలో ఒకవైపు విద్యార్థుల అడ్మిషన్ల మరోవైపు రాజకీయ ఒత్తిళ్లు మౌలి క సదుపాయాల కొడత విధులు నిర్వహిస్తున్న ఎస్వోలు ఇతర సిబ్బందిపై తీవ్ర ఒత్తి డిని ఎదుర్కొంటున్నట్టు ప్రచారం జరుగుతుంది. నిర్మల్ జిల్లాలోని అన్ని కేజీబీవీలో ఒక్కొక్క తరగతిలో 40 మంది అడ్మిషన్లను మాత్రమే తీసుకోవాల్సి ఉండగా నర్సాపూర్ దిల్వార్పూర్ నిర్మల అర్బన్ లక్ష్మణ్ చందా మామడ సారంగాపూర్ తదితర ప్రాంతాల్లో రెట్టింపు అడ్మిషన్లు నమోదు చేసుకోవడంతో తమ పిల్లలను కచ్చితంగా కేజీబీవీలో చేర్పించుకోవాలని తల్లిదండ్రులు ఎమ్మెల్యేలు మంత్రుల సిఫార్సులను కళాశాలపై రుద్దడంతో వారు మనోవేదనకు గురవుతున్నారు.

సౌకర్యాల విషయంలో స్పందించని ప్రజాప్రతినిధులు తమ అనుచరుల పిల్లలు మాత్రం కేజీబీవీ లో చేర్చుకోవాలని ఒత్తిడి తేవడంపై ఎస్వోలు మానసిక ఆవేదనకు గురవుతున్నారు. పిల్లలను ఎక్కువగా చేర్చుకుంటే మెనూ మారుతుందని ఇతర సదుపాల కల్పనలో నిర్లక్ష్యం పేరుతో ఉన్నతాధికారులు తనిఖీ నిర్వహించి విధుల్లో ఉన్న ఎస్వోలు వారి సిబ్బందిపై చర్యలు తీసుకోవడం కాకుండా సర్వీస్ నుంచి తొలగించడంపై చర్చ జరుగుతుంది.

వసతుల కల్పనకు ప్రభుత్వం నిధులు మంజూరు చేయకపోగా ఉన్న నిధులతో సర్దుబాటు చేసి సౌకర్యాలు కల్పిస్తున్న అధికారులు తమపై చర్యలు తీసుకుంటున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా కలెక్టర్ అభిలాష అభినందనలతో పాటు అడిషనల్ కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ జిల్లా విద్యాశాఖ అధికారి రామారావు కేజీబీవీ జిల్లా కోఆర్డినేటర్ సులోమికరణతో పాటు మండల స్థాయి అధికారులు కూడా కేజీబీవీలను తని ఖీ చేసి పడలెత్తిస్తున్నంతో విధులు నిర్వహిం చే సిబ్బంది ప్రతిరోజూ కత్తి మీద స్వాముల డ్యూటీ చేయవలసి ఉంటుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికా రులు విద్యార్థుల సంఖ్య కనుగుణంగా అదనపు వసతులు కల్పించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.