03-07-2025 01:14:32 AM
- పట్టించుకోని సింగరేణి అధికారులు
-పట్టాలతోనే విద్యుత్ కనెక్షన్లు
-పూర్తికాని విద్యుత్తు ఏర్పాట్లు
-మరో అవకాశం కోసం లబ్ధిదారుల ఎదురుచూపులు
బెల్లంపల్లి అర్బన్, జూలై 2: బెల్లంపల్లిలో పురాతన సింగరేణి క్వార్టర్ల పట్టాల ప్రక్రియ అసంపూర్ణంగానే మిగిలిపోయింది. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హాయాంలో బెల్లంపల్లిలోని బొగ్గు గనులతో వెలసిన తొలితరం సింగరేణి క్వార్టర్లకు పట్టాలిచ్చా రు. 4500 క్వార్టర్లను ప్రభుత్వానికి సరెండర్ చేశారు. దీంతో ఈ క్వార్టర్లు రెవెన్యూ ఆధీనంలోకి మారిపోయా యి. పట్టాల అందజేత గత ఎన్నికల ముం దు మొదలైంది. దీంతో అసంపూర్ణంగానే ఈ ప్రక్రియ ఆగిపోయింది.
కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుతీరాక బెల్లంపల్లి ఎమ్మెల్యేగా ఎన్నికైన గడ్డం వినోద్ పట్టాల ప్రక్రియను పూర్తి చేస్తానని చెప్పారు. అయితే ఆయన హాయం లో కూడా పట్టాల నమోదు కొంతమేరకు చేపట్టి పూర్తి చేయలేకపోయారు. దీంతో పట్టాల వ్యవహారం ఎక్కడ వేసిన గొంగళి అక్కడనే చందంగా ఉండిపోయింది. పట్టాల ప్రక్రియ పరిపూర్తి కాకపోవడంతో లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోసారి పట్టాల ప్రక్రియను చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. సింగరేణి యజమాన్యం సరెండర్ చేసిన సింగరేణి క్వార్టర్లకు పట్టాలు పూర్తిస్థాయిలో ఇవ్వాలి. కానీ మధ్యలోనే వాటికి ఎగనామం పెట్టడంతో ఇళ్ల పట్టాల సమస్య అపరిస్కృతంగా మిగిలిపోయింది.
ఓ వైపు సంతోషం.. మరోవైపు బాధ
సింగరేణి క్వార్టర్లు సొంతం కావడంతో కార్మికుల్లో ఎనలేని ఆనందం వ్యక్తం అవుతున్నది. ఇదే తరుణంలో అసంపూర్ణంగా మిగి లిపోవడంతో పట్టాలు చేతికందక మిగితా కార్మికులు బాధను కూడా వ్యక్తం చేస్తున్నా రు. ప్రకటించిన నివాస పట్టాలు యావత్ లబ్ధిదారులకు పూర్తిస్థాయిలో అందకుండా నే ముగించారు. మరో దఫా పట్టాల నిర్వహణను చేపడతారని ఎదురుచూస్తున్నారు. పూర్తిస్థాయిలో పట్టాలను చేపట్టకుండా మ ద్యంతరంగా ముగించడం పట్ల లబ్ధిదారులు తెగ బాధపడి పోతున్నారు.
ఇప్పటికైనా అధికారులు పెండింగ్‌లో ఉన్న పట్టాల వైపు దృ ష్టి పెట్టాలని కోరుతున్నారు. పట్టాలు పొం దని కార్మికులు విద్యుత్ కనెక్షన్ తీసుకునే సౌకర్యాన్ని కోల్పోతున్నారు. ఇప్పటివరకూ సింగరేణి సంస్థ నుంచి పొందుతున్న విద్యు త్ సదుపాయం ఎంతకాలం ఉంటుందో తెలియదు. ఎంతకాలం సింగరేణి విద్యుత్తు ఉంటుందో? ఎప్పుడు తొలగిస్తారో ఆందోళనలో కార్మికులు కాలం వెళ్లదీస్తున్నారు.
పట్టాలేని ఇండ్లకు కరెంటు శాపం..
ఇళ్ల పట్టాలకు నోచుకోని సింగరేణి కార్మికులకు ప్రత్యామ్నాయ విద్యుత్ సదుపాయం అందని ద్రాక్షగా మారింది. సింగరేణి నుంచి అప్పగించిన క్వార్టర్లకు పట్టాల ఘట్టం పరిపూర్తి కాలేదు. సింగరేణి కాలనీలో ప్రభుత్వ విద్యుత్తు సదుపాయం కల్పన కూడా ఇంకా పూర్తి కాలేదు. కొన్ని కాలనీలో విద్యుత్ స్తం భాలు వేసి వైరింగ్ చేశారు. మరి కొన్ని బస్తీ ల్లో విద్యుత్ స్తంభాల ఏర్పాట్ల పనులే సాగుతున్నాయి. విద్యుత్ పనులు పాక్షికంగా జరి గాయి. పట్టాలు పొందని ఎంతోమంది లబ్ధిదారులు విద్యుత్తు సదుపాయాన్ని పొందలే కపోతారు. ఈ విషయాన్ని అధికారులు, ఎమ్మెల్యే తక్షణమే పరిగణలోకి తీసుకోవాలని కోరుతున్నారు. సగానికి పైగానే సింగరే ణి క్వార్టర్లకు పట్టాలు పూర్తికాలేదు.
మరోసారి పట్టాలకు అవకాశం..
పెండింగ్‌లో ఉన్న పట్టాల సమస్యను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు. పట్టా లు కోసం మరోసారి అవకాశం ఇవ్వాలన్న ప్రజల విన్నపాలను లెక్కలోకి తీసుకోవాలి. ఇంతకు పూర్వం లబ్ధిదారుల్లో పట్టాల కోసం చేసుకున్న అప్లికేషన్లో చాలా వరకు సాంకేతిక కారణాల వల్ల రిజెక్ట్ అయ్యాయనీ వాపోతున్నారు. దీంతో ఇచ్చిన గడువులో నిర్ణీత కాలంలో పట్టాలు చేతికి రాకుండా పోయా యి. మెజార్టీగా తగినంత సమయం వెచ్చించకపోవడం వల్లనే లబ్ధిదారుడి చేతికి పట్టా అందలేకుండాపోయిందన్న వాదనలు ఉన్నాయి.
ఈ రకంగా పట్టాల సమస్య బెల్లంపల్లిలో అసంపూర్ణంగా మిగిలిపోయింది. లబ్ధిదారులకు న్యాయం జరగాలంటే మరోసారి పట్టాల ప్రక్రియను చేపట్టాల్సిన అవ స రం ఎంతైనా ఉన్నది. ప్రజల కోసం, ప్రకటించిన ఇళ్ల పట్టాల ప్రక్రియ పూర్తి అయ్యేవరకు పట్టాలకు అవకాశం ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వ అధికారులపైనే ఉంది. ఇలా జరగ ని పక్షంలో వందలాది మంది ఇళ్లపట్టాలను కోల్పోవల్సివస్తుందనీ వాపోతున్నారు.
మొక్కుబడిగా గత ప్రభుత్వం, ప్రస్తుత ఎమ్మె ల్యే పట్టాల అందజేతను హడావిడిగా కొనసాగించారన్న విమర్శలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి. దాని ఫలితంగానే పెండిం గ్లో పెద్ద ఎత్తున పట్టాలు మిగిలిపోయాయ న్న ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. ప్రతి ఒక్కరికీ పట్టాలు చేతికి వచ్చే విధంగా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత స్థానిక ఎమ్మెల్యేపై ఎంతైనా ఉందన్న విషయాన్ని గుర్తించాలని కోరుతున్నారు.