03-07-2025 01:09:51 AM
బోథ్, జూలై 2 (విజయక్రాంతి): విద్యార్థు ల సమస్యపై ‘విజయక్రాంతి’ ప్రచురించిన కథనానికి జిల్లా అధికారులు మేల్కోన్నారు. సొనాల మండలంలోని మారుమూల గిరిజన గ్రామమైన మహదుగూడలోని గిరిజన ప్రాథమిక పాఠశాలపై మంగళవారం ‘విజయక్రాంతి’ దినపత్రికలో ‘సారు రారు... తాళం తీయరు’ అనే శీర్షికను ప్రచురితం కథ నానికి జిల్లా విద్యా శాఖ అధికారులు స్పందించారు.
బుధ వారం బోథ్ మండల ఎంఈఓ హుస్సేన్, సొనాల మండల్ గిరిజన పాఠశాలల అబ్జర్వర్ రాంపాల్‌లు మహదు గూడ పాఠశాలను సందర్శించి, సీఆర్టీ ఉపాధ్యాయున్ని నియమించారు. గత కొన్ని రోజులుగా మూతపడి ఉన్న సర్కార్‌బడి తిరిగి తెరుచుకోవడంతో విద్యార్థులు ఉత్సాహంగా పాఠశాలకు తరలివచ్చారు. ఎంఈఓ పాఠశాలను పునఃప్రారంభించారు. అటు పాఠశాలకు రెగ్యులర్ ఉపాధ్యాయున్ని నియమిస్తామని హామీ ఇచ్చారు. దీంతో ఉపాధ్యాయుడు నియామకంతో పాటు పాఠశాల తాళం తీయించడంలో ముఖ్యపాత్ర పోషించిన ‘విజయక్రాంతి’ దినపత్రికకు గ్రామస్తులు, విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు.