06-09-2025 11:37:34 AM
11 రోజు ఫలాలంకణ లో గణనాథుడు
పటాన్ చెరు,(విజయక్రాంతి): వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా రుద్రారం ప్రసిద్ధిగాంచిన గణేష్ గడ్డ 11వ రోజు ఫలాలంకణ లో గణనాథుడు భక్తులకు దర్శనమిచ్చాడు. చివరి రోజు కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో లావణ్య మాట్లాడుతూ... బ్రహ్మోత్సవాలు కోసం అన్ని ఏర్పాట్లు సిద్ధంగా ఉన్నాయని ఆమె తెలిపారు. ఉదయం అభిషేకం, పల్లకి సేవలు నిర్వహిస్తున్నామని చెప్పారు. సాయంత్రం 5 గంటలకు లడ్డు వేలం పాట, 6 గంటలకి స్వామివారి దివ్య రథోత్సవం కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆమె వివరించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని ఆమె కోరారు.