calender_icon.png 6 September, 2025 | 2:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముప్పనపల్లి గ్రామంలో లడ్డూకు 21 వేయి 1రూపాయి వేలం

06-09-2025 11:53:40 AM

గణనాథుని లడ్డుకు హోరాహోరిగా పోటీపడ్డ భక్తులు. 

గణపతి లడ్డు వేలంలో 21 వేల 1రూపాయి పలికింది.

ముప్పనపల్లి గ్రామంలో గణపతి లడ్డును కైవసం చేసుకున్న  వెన్నంపల్లి వెంకటేష్-మౌనిక దంపతులు

కన్నాయిగూడెం,(విజయక్రాంతి): ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలోని ముప్పనపల్లి గ్రామంలో బొడ్రాయి గుడి దగ్గర నిర్వహించినటువంటి  గణపతి నవరాత్రి ఉత్సవాలు ముప్పనపల్లి బొడ్రాయి వద్ద చుట్టూ పక్కన ఉన్న యువజన నాయకులు మరియు యువకుల ఆధ్వర్యంలో జరిగాయి. గత తొమ్మిది రోజుల నుంచి నిత్య పూజలు,అన్నదానాలు కార్యక్రమాలు నిర్వహించి శుక్రవారం సాయంత్రం లడ్డువేలం కార్యక్రమం నిర్వహించారు.

ఈ గణనాథుని లడ్డు హోరాహోరిగా భక్తులు పోటిపడి సవాలుగా మారింది ఒకరిని మించి మరోకరు తగ్గకుండా భక్తులు "లడ్డు వేలం పాటలో నువ్వానేనా సై" అన్నారు చివరికి ముప్పనపల్లి గ్రామానికి చెందిన భక్తులు వెన్నంపల్లి వెంకటేష్-మౌనిక దంపతులు గణేష్ లడ్డు వేలం పాటను 21వేయి1రూపాయికి పాడి లడ్డును కైవసం చేసుకున్నారు ముప్పనపల్లి గ్రామంలో ఈసారి గణనాథుని లడ్డు సవాల్ మారిందని పలువురు గ్రామస్థులు అన్నారు కార్యక్రమంలో గ్రామ యువకులు మహిళా మణులు గ్రామ పెద్దలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేసుకున్నారు