calender_icon.png 6 September, 2025 | 2:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నీళ్ల ట్యాంకు ఎక్కి నిరసన

06-09-2025 11:35:34 AM

ఆసుపత్రిలో వైద్య సేవలు మెరుగుపరచాలి 

మహబూబాబాద్,(విజయక్రాంతి): కేసముద్రం పట్టణ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవలు మెరుగుపరచాలని, పిల్లలు, గర్భిణులు, కంటి, దంత వైద్య నిపుణులను నియమించాలని డిమాండ్ చేస్తూ కేసముద్రం కు చెందిన యువకుడు సతీష్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని నీళ్ల ట్యాంకు ఎక్కి నిరసన వ్యక్తం చేశాడు. ఈ సందర్భంగా సతీష్ మాట్లాడుతూ పేదలకు మెరుగైన వైద్యం అందించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని ఆరోపించారు. ఆటో డ్రైవర్ గా తాను అనేక పర్యాయాలు పేద ప్రజలను ఆస్పత్రికి తీసుకువెళ్తే సరైన వైద్యం అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి కేసముద్రం ప్రభుత్వ వైద్యశాలలో మెరుగైన వైద్యం అందించే విధంగా చర్యలు తీసుకోవాలని నిరసన చేపట్టినట్లు చెప్పాడు.