calender_icon.png 6 September, 2025 | 1:58 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సిద్దిపేట ప్రభుత్వ పాఠశాలల పనితీరుకు రాష్ట్ర స్థాయి గుర్తింపు

06-09-2025 11:34:09 AM

సిద్దిపేట: ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా హైదరాబాదులో జరిగిన కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా విద్యారంగం(Siddipet government schools) రాష్ట్రంలో మొదటి అవార్డు అందుకుంది. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి చేతుల మీదుగా జిల్లా కలెక్టర్ కే. హైమావతి, జిల్లా విద్యాధికారి శ్రీనివాస్ రెడ్డి అవార్డు స్వీకరించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడంతో ఈ విజయాన్ని సాధించామని పేర్కొన్నారు. విద్యాశాఖ అధికారి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రుల కృషి ఫలితమే ఈ గౌరవమని తెలిపారు.