13 July, 2026 | 9:39 PM

Breaking News

ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •  

సీఎం సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన బీఆర్ఎస్ కార్పొరేటర్లు

07-01-2026 03:31 PM

హైదరాబాద్: ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్‌లో(Khammam Municipal Corporation) బుధవారం మరో ముగ్గురు కార్పొరేటర్లు కాంగ్రెస్‌లో చేరడంతో బీఆర్‌ఎస్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) హైదరాబాద్‌లో కాంగ్రెస్ కండువాలు కప్పి వారిని పార్టీలోకి అధికారికంగా స్వాగతించారు. కాంగ్రెస్‌లో చేరిన కార్పొరేటర్లలో ధనియాల రాధా, తోట ఉమారాణి, రుద్రగాని శ్రీదేవి ఉన్నారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Minister Tummala Nageswara Rao) ఆధ్వర్యంలో చేరిక కార్యక్రమం జరిగింది. గతంలో, సి.హెచ్. లక్ష్మి, జి. చంద్రకళ, డి. సరస్వతి, అమృతమ్మ, ఎం. శ్రావణి సహా ఐదుగురు కార్పొరేటర్లు బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరారు. కొత్తగా పార్టీలో చేరిన ఈ కార్పొరేటర్లు ఆ తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే రాగమయి, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.