07-01-2026 03:30:49 PM
మాజీ మంత్రి డీఎస్ రెడ్యా నాయక్
మరిపెడ(విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్రం నవీన్ రావు గెస్ట్ హౌస్ నందు మున్సిపల్ కార్యకర్తల సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న డోర్నకల్ మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి డిఎస్ రెడ్యా నాయక్ రానున్న మున్సిపల్ ఎన్నికల్లో మరిపెడ పురపాలికలోని 15 వార్డులతో పాటు చైర్మన్ స్థానం బీఆర్ఎస్ సునాయాసంగా గెలుచుకోనుందని మాజీ మంత్రి డీఎస్ రెడ్యా నాయక్ ఆశాభావం వ్యక్తం చేశారు.
బుధవారం మరిపెడ మున్సిపల్ కేంద్రంలోని జిల్లా గ్రంథాలయం మాజీ చైర్మన్ గుడిపూడి నవీన్ రావు గెస్ట్ హౌస్ లో బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు ఉప్పల నాగేశ్వర రావు అధ్యక్షతన జరిగిన మునిసిపల్ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు సునాయాసంగా గెలిచారని స్పష్టం చేశారు. అదే స్పూర్తి తో పురపాలక ఎన్నికల్లోనూ పార్టీ శ్రేణులు సమన్వయంతో పని చేయాలని కోరారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండే నాయకత్వం బీఆర్ఎస్ పార్టీ నాయకత్వమేనని స్పష్టం చేశారు.
మరిపెడ మున్సిపాలిటీ ఏర్పాటు చేసి అభివృద్ధి కోట్లాది రూపాయలతో సుస్థిరమైన అభివృద్ధి చేయటం జరిగింది అన్నారు. ఉమ్మడి జిల్లాకు ఇండోర్ స్టేడియం తలమానికంగా మారిందని, మున్సిపల్ పార్కు, మరిపెడ ఎస్సీ కాలనీలో వ్యాయామ శాల, పల్లె, పట్టణ ప్రగతి పనులు, సెట్రల్ లైటింగ్ తో మరిపెడ దేదీప్యమానంగా కాంతులీనిందని, చేసిన ప్రగతిని ప్రజల ముందు ఉంచి ఓటర్లను అభ్యర్థించాలని కోరారు. మరిపెడ పురపాలిక సునాయసంగా బీఆర్ఎస్ పార్టీ గెలవనుందని పేర్కొన్నారు.