calender_icon.png 6 June, 2025 | 10:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రారంభోత్సవానికి సిద్ధమైన ఖమ్మం మహిళా మార్ట్: కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్

28-05-2025 12:00:00 AM

సీక్వెల్ రోడ్డులోని మహిళా మార్ట్ ప్రారంభ ఏర్పాటు పనులను పరిశీలించిన కలెక్టర్

ఖమ్మం, మే 27 (విజయక్రాంతి): మహిళా సం ఘాలకు అర్ధిక భరోసా కల్పించే లక్ష్యంతో ఏర్పా టు చేసిన ఖమ్మం మహిళా మార్ట్  బుధవారం మంత్రులచే అధికారంగా ప్రారంభోత్సవంకు సంసిద్దం చేసినట్లు జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్  తెలిపారు. మంగళవారం జిల్లా కలెక్టర్, సీక్వెల్ రోడ్డులోని ఖమ్మం మహిళా మార్ట్ ను సందర్శించి మంత్రులచే ప్రారంభోత్సవ ఏర్పాటు పనులను పరిశీలించారు.

మార్ట్ లో ఏర్పాటు చేసే ఆర్గానిక్ ఉత్పత్తులు, మహిళాలచే చేసిన తినుబండారాలు, బొమ్మలు, ఎక్విప్మెంట్ లపై, ప్రొడకట్స్, స్వయం తయారీ ఇతర ఏర్పాట్లపై పలు సూచనలు చేశారు. ఖమ్మం బ్రాండ్ మార్క్ ను పరిశీలించారు. మార్ట్ ఆకర్షణీయంగా ఉండే విధంగా కంప్యూటరైజ్ బిల్లు, లోగోల నిర్వహణ పట్ల అధికారులను కలెక్టర్ అభినందించారు.

ఈ సందర్భంగా  ఆయన మాట్లాడుతూ మహిళా మార్ట్ నిర్వహణపై మహిళా సంఘాల సభ్యులకు అవసరమైన శిక్షణ అందించామన్నారు. మహిళా మార్ట్ ను లాభాల బాటలో నడిపేలా మహిళా సంఘాలకు ప్రత్యేక కార్యచరణ రూపొంచామన్నా రు. మహిళా మార్ట్ లో ఏ.సి. ఏర్పాటు ద్వారా ప్రతి నెలా కరెంట్ బిల్లు అధికంగా వస్తుందని, మహిళా మార్ట్ ప్రారంభించిన తర్వాత నిర్వహణ బాధ్యత స్వశక్తి మహిళా సంఘాలపై మాత్రమే ఉంటుందని, వీటిని పరిశీలించి ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సూచించారు.

మహిళా మార్ట్ ముందు భాగంలో ఉన్న ఓపెన్ స్పేస్ లో రిటైల్ బిజినెస్ క్రింద ఏర్పాటు చేస్తున్న వాటిని, వర్షం వచ్చిన కూడా ఇబ్బంది లేకుండా నీడలో కూర్చొనే విధంగా సీటింగ్ అరేంజ్మెంట్, పార్కింగ్ సమస్యలు తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలన్నారు.

మహిళా మార్ట్ నిర్వహణ కట్టుదిట్టంగా ఉండాలని, సామాన్లు అందంగా పొందికగా అమర్చాలని, పరిసరాలు పరిశుభ్రంగా ఉండే విధంగా చర్యలు చేపట్టాలని తెలిపారు. మహిళా మార్ట్ లో పెట్టే వస్తువుల స్టాక్ నిల్వలు పకడ్బందీగా భద్రపరిచేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్డీవో సన్యాసయ్య, పీఆర్ ఎస్‌ఈ వెంకట్ రెడ్డి, పీఆర్ ఈఈ మహేష్ బాబు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.