అందరిలో దైవభక్తి ఉండాలి
నగర డిప్యూటీ మేయర్ మారేపల్లి సురేందర్ రెడ్డి
మహబూబ్ నగర్ టౌన్, ఏప్రిల్ 2: ప్రతి ఒక్కరిలో దైవభక్తి ఉండాలని నగర డిప్యూటీ మేయర్ మారేపల్లి సురేందర్ రెడ్డి అన్నారు. గురువారంగణేష్ నగర్, మినీ ట్యాంక్ బండ్, మర్లు, మొనప్ప గుట్ట, మొండి గెరి, డబుల్ బెడ్రూం, వేపుర్ గ్రామంలో నిర్వహించిన హనుమాన్ జయంతి కార్యక్రమంలో మహబూబ్ నగర్ డిప్యూటీ మేయర్ మారేపల్లి సురేందర్ రెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెస్సార్ మాట్లాడుతూ.. సకల పీడలను తొలగించే ఆ అభయాంజనేయుడు సమస్త భూ ప్రపంచానికి ఎదురైన విపత్తును పారద్రోలాలని, ప్రతి ఒక్కరికి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆ స్వామి వారిని పార్థిస్తున్నన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ డివిజన్ల కార్పొరేటర్లు రమేశ్ రెడ్డి, చిన్న, శేఖర్, సల్మాన్, రఘు, కుర్వ సత్యం, మాక్సూద్, మద్దురి కృష్ణ, మైత్రి యాదయ్య, లీడర్ రఘు, తదితరులు ఉన్నారు.




