22 July, 2026 | 1:59 AM

ఘనంగా ఖర్గే జన్మదిన వేడుకలు

22-07-2026 12:00 AM

కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే 84వ జన్మదిన వేడుకలు ఉట్నూర్ మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్మల్ డిసిసి అధ్యక్షు లు, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముం దుగా కేక్ కట్ చేసి నాయకులు, కార్యకర్తలు కేక్ తినిపించుకున్నారు. ఎమ్మెల్యే వెడ్మ బొ జ్జు పటేల్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కో సం అహర్నిశలు జీవిత కాలం కష్టపడుతూ పార్లమెంట్ లో ప్రతిపక్ష నాయకుడిగా ప్రభు త్వం చేస్తున్న అన్యాయాలను ఎప్పటికప్పుడు సమస్యలు లేవనెత్తుతూ ప్రజల పక్షాన పోరాడుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా, మండల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.