17-07-2025 12:05:25 AM
విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘కింగ్‌డమ్’. సత్యదేవ్, భాగ్యశ్రీ బోర్సే ముఖ్య పాత్ర లు పోషిస్తున్న ఈ చిత్రాన్ని దర్శకుడు గౌతమ్ తిన్ననూరి తెరకెక్కిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూ న్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మిస్తున్నారు.
జూలై 31న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే టీజర్, ఫస్ట్ సింగిల్ విడుదలయ్యాయి. తాజాగా బుధవారం ఈ చిత్రం నుంచి రెండో గీతం ‘అన్న అంటేనే’ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ భావోద్వేగ గీతా న్ని అనిరుధ్ రవిచందర్ స్వరపరిచి, ఆలపించారు. ఈ పాటకు కృష్ణకాంత్ అందించిన సాహిత్యం అందరినీ కదిలించేలా ఉండటంతోపాటు సోదరభావానికి వేడుకలా మారింది. ఈ పాటలో సోదరులుగా విజయ్ దేవరకొండ, సత్యదేవ్ కొత్తగా కనిపిస్తున్నారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: జోమోన్ టీ జాన్, గిరీశ్ గంగాధరన్; కూర్పు: నవీన్ నూలి.