calender_icon.png 18 July, 2025 | 1:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

30 రోజుల్లో వార్2

17-07-2025 12:07:01 AM

బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్, టాలీవుడ్ స్టార్ ఎన్టీఆర్, కియారా అద్వానీ ప్రధాన పాత్రల్లో స్టార్ డైరెక్టర్ అయాన్ ముఖర్జీ తెరకెక్కించిన తాజాచిత్రం ‘వార్2’. ఈ యాక్షన్ ఓరియెంటెడ్ స్పై డ్రామాను యష్‌రాజ్ ఫిల్మ్స్ సంస్థ నిర్మించింది. బ్లాక్‌బస్టర్ వైఆర్‌ఎఫ్ స్పై యూనివర్స్ నుంచి రానున్న ఈ సినిమా కోసం ప్రస్తుతం అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఈ స్పై థ్రిల్లర్ ఆగస్టు 14న హిందీ, తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది. అంటే, ఇంకా ముప్పు రోజుల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ చిత్ర నిర్మాణ సంస్థ తాజాగా ఆసక్తికరమైన కౌంట్‌డౌన్ పోస్టర్‌ను సామాజిక మాధ్యమాల ద్వారా పంచుకుంది. ఈ పోస్టర్‌లో ప్రధాన పాత్రల్ని చూపించిన తీరు అమితంగా ఆకట్టుకుంటోంది. హృతిక్, ఎన్టీఆర్, కియారా త్రయానికి సినిమాలో ఉన్న ప్రాధాన్యాన్ని తెలియజేస్తూ డిజైన్ చేసిన ఈ కొత్త పోస్టర్ అభిమానుల్లో ఉత్సాహాన్ని రేకెత్తించింది.