17-07-2025 12:04:05 AM
ప్రముఖ రాజకీయ నాయకుడు, వ్యాపారవేత్త గాలి జనార్ధన్‌రెడ్డి కుమారుడు కిరీటిరెడ్డి హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘జూనియర్’. రాధాకృ ష్ణ దర్శకత్వంలో వారాహి చలనచిత్రం బ్యానర్‌పై రజని కొర్రపాటి నిర్మిస్తున్నారు. శ్రీలీల హీరోయిన్ కాగా, జెనీలియా కీలక పాత్ర పోషిస్తోంది. జూలై 18న రిలీజ్ కానున్న ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌ను మేకర్స్ బుధవారం హైదరాబాద్‌లో నిర్వ హించారు.
ప్రముఖ దర్శకుడు రాజమౌళి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ.. “మంచి కథతో చిన్న సినిమా చేస్తున్నారనుకున్నా. ఒక పెద్ద చిత్రంలో లాగా నటీనటులు, టెక్నీషియన్స్‌ను భాగం చేస్తూ చాలా పెద్ద సినిమా చేశారు. తొలిరోజే చూడాలనే ఆసక్తి కలిగేలా ఈ సినిమా స్థాయిని పెంచడం అభినందనీయం. పీటర్, సెంథిల్ ఇద్దరు పొడుగు తున్నారంటే.. కిరీటీకి అంతకంటే పెద్ద సర్టిఫికెట్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉండదు. ఈ సినిమా కిరీటీని తప్పకుండా పెద్ద స్థాయికి వెళ్తుంది.
పైసా వసూల్ మూవీ ఇది” అన్నారు. హీరో కిరీటి మాట్లాడుతూ.. “కష్టపడి నిజాయితీగా ప్రయత్నిస్తే తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ పైకి తీసుకొస్తారు. ఈ సినిమా నాకోసం ఒక్క శాతం, ప్రొడ్యూసర్ సాయి కోసం 99 శాతం విజ యం సాధించాలి. రాధాకృష్ణ లాంటి డైరెక్టర్‌పైకి వస్తే ఇండస్ట్రీకి చాలా మంచిది” అన్నారు. ‘18న మేమందరం కిరీటి సక్సెస్‌ను సెలబ్రేట్ చేసుకుంటా’మని జెనీలియా అన్నారు.
హీరోయిన్ శ్రీలీలా మాట్లాడుతూ.. “నాకు వైరల్ వయ్యారి టాగ్ వచ్చిందంటే దేవిశ్రీప్రసాద్ వల్లే. మా హీరో కిరీటికి సినిమా తప్పితే మరో ధ్యాస లేదు. చాలా అంకితభావంతో పనిచేశారు” అన్నారు. ఈ కార్యక్రమంలో సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్, డీవోపీ సెంథిల్‌కుమార్, ఫైట్ మాస్టర్ పీటర్ హెయిన్, నటులు సందీప్‌రాజ్, వైవా హర్ష, మిగతా చిత్రబృందం పాల్గొన్నారు.