కన్నప్పలో కిరాతగా..
విష్ణు మంచు కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం ‘కన్నప్ప’. ఈ సినిమా లో ప్రభాస్, అక్షయ్‌కుమార్, మోహన్‌లాల్ లాంటి స్టార్లు భాగమవుతున్నారు. ప్రీతి ముకుందన్ కథానాయికగా నటిస్తోంది. ముఖేశ్‌కుమార్ సింగ్ దర్శకత్వం లో అవా ఎంటర్‌టైన్‌మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై మంచు మోహన్‌బాబు నిర్మిస్తున్న ఈ సినిమా 2025, ఏప్రిల్ 25న విడుదల కానుంది. అయితే, మేకర్స్ కొద్దిరోజులుగా ఈ చిత్రం నుంచి ఒక్కో పాత్రను రివీల్ చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా మాలీవుడ్ స్టార్ మోహన్‌లాల్ ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. సినిమా లో మోహన్‌లాల్.. ‘కిరాత’ అనే పవర్‌ఫుల్ రోల్‌లో కనిపించనున్నట్టు తెలుపుతూ ఈ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఇందులో మోహన్‌లాల్ గంభీరమైన రూపాన్ని చూస్తుంటే.. చిత్రా నికి సంబంధించి మేజర్ హైలైట్స్‌లో ఈ క్యారెక్టర్ కూడా ఒకటని స్పష్టమవుతోంది. మోహన్ లాల్ పాత్ర పేరును బట్టి ‘కిరాతార్జునీయం’ మహాకావ్యంలోని సన్నివేశాలు సైతం ఈ సినిమాలో చూపించనున్నట్టు తెలుస్తోంది.






