ప్రేమికుల రోజున వస్తున్న లైలా
హీరో విశ్వక్‌సేన్ మరో కొత్త చిత్రం ‘లైలా’తో అందరినీ ఆశ్చర్యపరిచేందుకు వస్తున్నాడు. విశ్వక్.. ఈ సినిమాలోని అమ్మాయి పాత్ర కోసం అందంగా మేకోవర్ అయ్యాడు. ఈ చిత్రంతో ఆకాంక్షశర్మ కథానాయికగా అరంగేట్రం చేస్తోంది. రామ్ నారాయణ్ దర్శకత్వంలో షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని మేకర్స్ ప్రకటించారు. ప్రేమికుల రోజు సందర్భంగా ఫిబ్రవరి 14న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్న ట్టు వెల్లడించారు. రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్ పోస్టర్‌లో విశ్వక్‌సేన్.. చొక్కాతో తన ముఖాన్ని దాచుకుంటూ స్టులిష్ అవతార్‌లో కనిపించారు. నూతన సంవత్సర కానుకగా 2025, జనవరి 1న ఈ సినిమా ఫస్ట్ రోజ్ (ఫస్ట్ లుక్)ను రిలీజ్ చేస్తామని మేకర్స్ ప్రకటించారు.






