calender_icon.png 17 July, 2025 | 10:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కిసాన్ కార్డులు వచ్చేశాయి

16-07-2025 12:00:00 AM

- పాస్ పుస్తకాల ఆధారంగా జారీ

-రేకుర్తిలో నాలా భూములకు జారీపై అభ్యంతరాలు

కరీంనగర్, జూలై 15 ): ఆధార్తో దేశంలోని ప్రతి పౌరునికి గుర్తింపు ఇచ్చి ప్రతి రైతుకు 14 నెంబర్లతో విశిష్ట సంఖ్యను కేటాయించాలని కేంద్రం నిర్ణయించింది. వ్యవసాయ రంగాన్ని పూర్తిగా డిజి టలైజ్ చేయాలనే సంకల్పంతో కేంద్ర ప్రభు త్వ సహకారంతో ఈ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. ఈ మేరకు కరీంనగర్ జిల్లాలో కిసాన్ కార్డుల జారీ ప్రక్రియ ప్రారంభమయింది.

భూమి ఉన్న ప్రతి రైతుకు తనకున్న భూములకు సంబంధించిన వివరాలతో కూడిన సమాచారంతో ఈ ఫార్మర్ రిజిస్ట్రీ కార్డు జారీ చేస్తున్నారు. రెవెన్యూశాఖ ద్వారా సేకరించిన భూ యాజమాన్య వివరాలను రైతు యొక్క ఆధార్ సంఖ్యను అనుసంధా నం చేయడం ద్వారా ఈ ఫార్మర్ ఐడీ కా ర్డులు రూపొందిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన పథకాలైన రైతు భరోసా, రైతు బీమా, రుణమాఫీ ఈ కార్డుకు సం బంధం ఉండదు. అయితే కేంద్ర ప్రభుత్వం పథకాల అమలుకు ఈ కార్డు సంబంధం ఉంటుంది.

ఎరువుల కేటాయింపు కూడా త్వరలో ఈ కార్డు ద్వారా చేయనున్నారు. రెవెన్యూశాఖవారు జారీ చేసిన పట్టాదారు పాస్ పుస్తకాల ఆధారంగా వీటిని ఇస్తున్నారు. కరీంనగర్ శివారును ఆనుకొని ఉన్న రేకుర్తిలో ఈ మేరకు 164 మంది జాబితాను వివిధ సర్వే నెంబర్లకు సంబంధించి విడుదల చేశారు. వీటిలో నాలుగైదు సర్వే నెంబర్లు మినహా మిగతావన్నీ వ్యవసాయేతర భూ ములే. ఇప్పటికే ఆ భూములు పలువురి చేతులు మారాయి, కొన్నిచోట్ల భవన నిర్మాణాలు కూడా జరిగాయి. ఈ క్రమంలో కిసా న్ కార్డులు జారీ చేస్తే భవిష్యత్ లో ఈ భూ ములు కొన్నవారికి ఇబ్బందులు ఎదురవుతాయన్న ఆందోళన మొదలయింది. సర్వే నెంబర్ 16, 55 ప్రభుత్వ భూములు.

55 సర్వే నెంబర్ ఇప్పటికే నమ్మక్క సారలమ్మ దేవాలయం పరిధిలో ఉంది. అలాగే సర్వే నెం. 119, 110, 118, 64 లలోని భూములను 25-30 సంవత్సరాల నుంచే క్రయ విక్ర యాలు కొనసాగుతున్నాయి. సర్వే నెం. 16 కూడా ప్రభుత్వ భూమిగానే ఉంది. ఇలాంటి సర్వే నెంబర్లలోని భూములకు కిసాన్ కార్డులు జారీ చేయడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. రేకుర్తి పరిధిలోని అనేక సర్వే నెంబర్లలో 25, 30 సంవత్సరాల క్రితం నాలా కింద మార్చకుండానే క్రయ, విక్రయాలు కొనసాగించారు. ఈ ప్రాంతంలో భూ ఆక్రమణలు విపరీతంగా ఉండదు. చాలాచోట్ల ఇండ్ల నిర్మాణాలు పూర్తికావడం జరిగింది. సర్వే చేయకుండా కిసాన్ కార్డులు జారీ చేసేందుకు సిద్ధం కావడంపై విమర్శలు వస్తున్నాయి..

-పట్టాదారు పాస్ పుస్తకాల ఆధారంగా కిసాన్ కార్డులు...

రెవెన్యూశాఖ వారు జారీ చేసిన పట్టాదారు పాస్ పుస్తకాల ఆధారంగానే కిసాన్ కార్డులను జారీ చేస్తున్నాం. కరీంనగర్ జి ల్లాలో ఈ ప్రక్రియ ప్రారంభమయింది. పీ ఎం కిసాన్ యోజన కింద అందించే పథకాలతోపాటు కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం ఇస్తున్న పథకాలు ఈ కార్డు కింద ఉపయోగపడతాయి. రైతు భరోసా, రైతు బీమాకు ఈ కార్డులతో సంబంధం ఉండదు. రేకుర్తి భూ ముల విషయం తమ పరిధి కాదు, తహసిల్ కార్యాలయం నుండి జారీ అయిన పాస్ పు స్తకాల ద్వారా కిసాన్ కార్డులజారీఉంటుంది.

 ఏఈవో రాము చెప్యాల