calender_icon.png 16 July, 2025 | 7:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చిన్నప్పుడు కిరాయి తీసుకుని సైకిల్ తొక్కేవాణ్ని

16-07-2025 12:00:00 AM

-  పేద కుటుంబం నుండి ఈ స్థాయికి చేరుకున్నా

-  ఇకపై ప్రతి ఏటా సైకిళ్లను పంపిణీ చేస్తా

-  త్వరలోనే ఎల్ కేజీ పిల్లలకు ‘మోదీ కిట్స్’ అందజేస్తా

-  కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్

-  విద్యార్థులతో కలిసి సైకిల్ ర్యాలీ నిర్వహించిన బండి సంజయ్

రాజన్న సిరిసిల్ల: జులై 15) తాను పేద కుటుంబం నుండి వచ్చానని, సొంతంగా సైకిల్ కూడా ఉండేది కాదని కేం ద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజ య్ కుమార్ అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులంతా పేద కుటుంబాలకు చెందిన వారేనని, ఆ బాధ విద్యార్థులు పడకూడదనే ఉద్దేశంతోనే టెన్త్ విద్యార్థులందరికీ సైకిళ్లను పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. ఎంపీగా ఉన్నంత కాలం ప్రతి ఏటా టెన్త్ చది వే విద్యార్థులందరికీ ఉచితంగా సైకిళ్లను పం పిణీ చేస్తానని ప్రకటించారు.

దీంతోపాటు త్వరలోనే ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులందరికీ ‘మోదీ కిట్స్’ అందజేస్తానని తెలిపారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలో తంగళ్లపల్లిలో టెన్త్ చదువుకునే ప్రభుత్వ పాఠశా లల విద్యార్థులందరికీ బండి సంజయ్ కు మార్ తన చేతుల మీదుగా సైకిళ్లను అందజేశారు. విద్యార్థులంతా కలిసి సిరిసల్ల పట్ట ణంలో సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ సం దర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అంజిరెడ్డి, జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ మహేశ్, బీ జేపీ జిల్లా అధ్యక్షులు రెడ్డబోయిన గోపి, మాజీ అధ్యక్షులు ప్రతాప రామక్రిష్ణ తదితరు లు హాజరయ్యారు. ప్రధాని నరేంద్ర మో దీ గిఫ్ట్ ఈ సైకిల్. ముఖ్యంగా విద్యా, వైద్య రంగ అభివ్రుద్ధికి ప్రతి ఒక్కరూ క్రుషి చేయాలని మోదీ నిత్యం చెబుతున్నారు. ఆ స్పూ ర్తితోనే సైకిళ్ల పంపిణీ చేపట్టిన అని బండి సంజయ్ అన్నారు. .

ఇవి బతుకమ్మ చీరల్లేక క్వాలిటీ లేనివి కావు. ఇవి బ్రాండెడ్ సైకిల్ అ న్నారు. ఎంపీగా ఉన్నంత కాలం సైకిళ్లను పం పిణీ చేస్తా. దీంతోపాటు ఎల్ కేజీ నుండి చదివే విద్యార్థులందరికీ మోదీ కిట్స్ పేరుతో బ్యాగు అందిస్థా అన్నారు.వ్యవసాయ కు టుంబం నుండి వచ్చిన వ్యక్తి జిల్లా ఎస్పీ మ హేశ్. ఏ కోచింగ్ తీసుకోకుండా కష్టపడి చ దువుకుని సివిల్స్ కు ఎంపికై ఐపీఎస్ కు ఎంపికయ్యరని వీళ్లను విద్యార్థులంతా స్పూ ర్తిగా తీసుకోవాలన్నారు. సైకిళ్లపై బట్టలు తీ సుకెళ్లి గతంలో అమ్మేవాళ్లు.

వారంతా ఎం తో కష్టపడి పిల్లలను చదివిస్తున్నారనీ ఆ కష్టాన్ని గుర్తు చేసుకుని బాగా చదువుకోవాలని కేంద్రంమంత్రి సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లోనే మంచి విద్యను బోధిస్తారనే విషయాన్ని గుర్తుంచుకోబాలన్నారు. యూ పీఏ హయాంలో విద్యకు రూ.68 వేల కోట్లు మాత్రమే కేటాయిస్తే... మోదీ ప్రభుత్వం ఈ బడ్జెట్ లో ఏకంగా 1.28 లక్షల కోట్లను కేటాయించిందనో. గత 11 ఏళ్లలో రూ.8 లక్షల కోట్లకుపైగా నిధులు కేటాయించినదన్నారు.