31 August, 2026 | 2:37 AM

రెండోసారి మోడీ కేబినెట్‌లో కిషన్ రెడ్డికి చోటు

09-06-2024 02:12 PM

హైదరాబాద్: తెలంగాణకు చెందిన బీజేపీ ఎంపీలు గంగాపురం కిషన్ రెడ్డి, బండి సంజయ్‌లను ప్రధాని నరేంద్ర మోడీ తన మంత్రివర్గంలోకి తీసుకున్నారు. కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌లు సికింద్రాబాద్‌, కరీంనగర్‌ నియోజకవర్గాల నుంచి రెండోసారి తమ స్థానాలను దక్కించుకున్నారు. 

కిషన్ రెడ్డి ప్రస్థానం

మధ్యతరగతి రైతు కుటంబంలో కిషన్ రెడ్డి జన్మించారు. జనతా పార్టీ యువకార్యకర్తగా 1977లో రాజకీయ రంగప్రవేశం చేశారు. 1990-92 వరకు బీజేవైఎం అఖిల భారత కార్యదర్శిగా పనిచేశారు. 2002లో భారతీయ జనతా యువ మోర్చా జాతీయాధ్యక్షుడిగా అవకాశం దొరికింది. 2004లో హిమాయత్ నగర్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేశారు. నియోజకవర్గాల పునర్ విభజనలో అంబర్ పేట్ నుంచి ఆయన బరిలోకి దిగారు. 2009,2014లో అంబర్ పేట్ నుంచి పోటీ చేసి గెలుపొందారు. 2004,2009,2014ల్లో కిషన్ రెడ్డి వరసగా హ్యాట్రిక్ విజయాలు వరించాయి.

2010 నుంచి 2014 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు పార్టీ అధ్యక్షుడిగా అవకాశం దక్కింది. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ పార్టీ అధ్యక్షుడిగా అవకాశం. 2018లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో కిషన్ రెడ్డి ఓడిపోయారు. లోక్ సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. నరేంద్రమోడీ మంత్రివర్గంలో చోటు దక్కింది. 2019, 2021 వరకు కేంద్రహోంశాఖ సహాయమంత్రిగా ఉన్నారు. 2021 జూలై నుంచి కేంద్ర సాంత్కృతిక, పర్యాటక మంత్రిగా బాధ్యతు అప్పగించారు. 2023 జూలై నుంచి నాలుగోసారి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియామకం అయ్యారు.