సోనియాను విమర్శించే అర్హత కిషన్‌రెడ్డికి లేదు
24-05-2024 12:15 AM
పీసీసీ అధికార ప్రతినిధి బండి సుధాకర్‌గౌడ్
హైదరాబాద్, మే 23 (విజయక్రాంతి): స్వదేశీ, విదేశీ వ్యాపారం చేసే కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి.. సోనియాగాంధీని విమర్శించే అర్హత లేదని పీసీసీ అధికార ప్రతినిధి బండి సుధాకర్‌గౌడ్ హితవు పలికారు. గురువా రం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఒక్క ఓటు రెండు రాష్ట్రాలు అని కాకినాడ తీర్మానం చేసిన బీజేపీ.. తెలంగాణ ఎందుకు ఇవ్వలేదో కిషన్‌రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి రైతులను బెదరిస్తున్నారని కిషన్‌రెడ్డి మాట్లాడటం సరికాద, అలాగే మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డిపై బీజేపీఎల్పీ నేత మహేశ్వర్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను సుధాకర్ ఖండించారు.






