19 August, 2026 | 12:31 AM

మంత్రి ఉత్తమ్ వైట్ పేపర్ లాంటి వ్యక్తి

24-05-2024 12:16 AM

పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి స్పష్టీకరణ 

హైదరాబాద్, మే 23 (విజయక్రాంతి):  మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పై.. బీజేపీఎల్పీ నేత మహేశ్వర్‌రెడ్డి చేసిన వ్యాఖ్యల్లో ఎలాంటి వాస్తవం లేదని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ప్రకటించారు. మంత్రి ఉత్తమ్ వైట్ పేపర్ లాంటి వ్యక్తి అని పేర్కొన్నారు. ఆయనపై ఇంక్ చల్లడం సరికాదని అన్నారు. గురువారం గాంధీభవన్‌లో పార్టీ నేతలు మెట్టు సాయికుమార్, చనగాని దయాకర్, లింగంయాదవ్, గజ్జి భాస్కర్‌తో కలి సి మీడియాతో మాట్లాడారు.

కాంగ్రె స్ పార్టీ ప్రజలు, రైతుల పక్షపాతి అని పేర్కొన్నారు.  కాంగ్రెస్ ప్రభు త్వం వచ్చాకే వర్షాలు పడ్డాయని, రైతుల ధాన్యం తడిసిందన్నారు. తడిసిన, మొలకెత్తిన ధాన్యాన్ని మద్దతు ధరకే ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని చెప్పారు. సీఎం రేవంత్‌రెడ్డితో పాటు మంత్రులు సమిష్టిగా పని చేస్తున్నారని పేర్కొన్నారు. రేవంత్‌రెడ్డి ఐదేళ్లపాటు సీఎంగా కొనసాగుతారని స్పష్టం చేశారు.