సోనియాగాంధీ తెలంగాణ దేవత
24-05-2024 12:13 AM
ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి
హైదరాబాద్, మే 23 (విజయక్రాంతి): ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిన సోనియాగాంధీ తెలంగాణ ప్రజలకు దేవత అని, ఆమెపై బీజేపీ నేతలు విమర్శలు చేయడం సరికాదని కాంగ్రెస్ ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. గురువారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పాటులో సోనియా కృషిని బీజేపీ నేత సుష్మాస్వరాజ్ కూడా కొనియాడారని గుర్తు చేశారు. ఇప్పటీ వరకు రాష్ట్ర ప్రభుత్వం 30 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించిందన్నారు. దొడ్డు వడ్లకు రూ. 500 బోనస్ ఇవ్వమని ప్రభుత్వం ఎక్కడా చెప్పలేదన్నారు.






