లోక్‌సభలో కిషన్‌రెడ్డి వర్సెస్ చామల
- బీఆర్‌ఎస్ పదేళ్ల దోపిడీపై ఎందుకు మౌనంగా ఉన్నారు
కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిని నిలదీసిన ఎంపీ చామల
రాష్ట్ర అభివృద్ధికి నిధులు తీసుకొచ్చి సహకరించాలి
హైదరాబాద్, ఏప్రిల్ 2 (విజయక్రాంతి): లోక్‌సభ వేదికగా తెలంగాణ రాజకీయాలు వేడెక్కాయి. సభలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి లేవనెత్తిన అంశాలపై భువనగిరి కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ధీటుగా స్పందించారు. తెలంగాణ అభివృద్ధి, అప్పులు, మూసీ పునరుజ్జీవంపై కేంద్రం తీరును ఆయన తూర్పారబట్టారు. పదేళ్ల పాటు బీఆర్‌ఎస్ చేసిన ఆర్థిక విధ్వంసంపై కిషన్‌రెడ్డి ఇప్పుడు మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు.
హైదరాబాద్ నగరాభివృద్ధిలో భాగంగా మూసీ నది పునరుజ్జీవనానికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని చామల స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టు కోసం ప్రపంచ బ్యాంకు నుంచి 500 మిలియన్ డాలర్ల రుణానికి సంబంధించి ప్రిలిమినరీ ప్రపోజల్ రిపోర్టు (పీపీఆర్)ను ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం సిద్ధం చేసినట్లు చామల తెలిపారు. ఈ నివేదికను కేంద్ర సంబంధిత శాఖా మంత్రికి, నీతి ఆయోగ్‌కు కూడా సమర్పించామని, దీనిపై కేంద్రం సానుకూలంగా స్పందించి సహకరించాలని ఆయన కోరారు.
బీఆర్‌ఎస్, బీజేపీలపై ఘాటు విమర్శలు
రాష్ట్ర అప్పులపై కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు ఎంపీ చామల ఘాటుగా సమా ధానమిచ్చారు. గత పదేళ్ల బీఆర్‌ఎస్ ప్రభుత్వ పాలనలో తెలంగాణను అప్పుల పాలు చేసి దోచుకున్నారు. మరి ఆ పదేళ్లూ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉంది.. ? దో పిడీ జరుగుతుంటే చర్యలు తీసుకోకుండా ఎందుకు సైలెంట్‌గా ఉ న్నారు.. ? అని నిలదీశారు. తెలంగాణ ప్ర యోజనాల దృష్ట్యా రాజకీయాలకతీతంగా కేంద్రం రాష్ట్రానికి అండగా ఉండాలని కోరారు.




