13 July, 2026 | 9:36 PM

Breaking News

నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •   సర్ పత్రాల సేకరణను పరిశీలించిన మాజీ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్   •  

విద్యార్థులకు 22 వస్తువులతో కిట్లు

13-01-2026 12:13 AM
  1. యూనిఫామ్, టై, షూస్, బ్యాగ్‌తో కలిపి పంపిణీ
  2. నాణ్యత విషయంలో రాజీపడొద్దు
  3. వచ్చే విద్యాసంవత్సరం అందించాలి
  4. అధికారులతో సమీక్షలో సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలు

హైదరాబాద్, జనవరి 12 (విజయక్రాంతి): ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అందించనున్న 22 వస్తువులతో కూడిన కిట్‌కు సంబంధించి నాణ్యత విషయంలో రాజీపడొద్దని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం ముఖ్యమంత్రి నివాసంలో ప్రభు త్వ సంక్షేమ హాస్టళ్లు, పాఠశాలల విద్యార్థులకు అందించే వస్తువులకు సంబంధించి సెంట్రల్ ప్రొక్యూర్‌మెంట్‌పై ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు తిరిగి ప్రారంభమయ్యే నాటికి విద్యార్థులకు కిట్ అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. విద్యార్థుల విషయంలో ఖర్చుకు వెనకాడొద్దని, ఎట్టి పరిస్థితుల్లోనూ నాణ్యత విషయంలో రాజీ పడొద్దని తెలిపారు.

యూనిఫామ్‌తో పాటు 21 వస్తువులతో కూడిన కిట్‌ను విద్యార్థులకు అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. స్కూల్ బెల్ట్, టై, షూస్, స్కూల్ బ్యాగ్, నోట్ బుక్స్, ఇతర వస్తువులను అందించేందుకు అవసరమైన ప్రొక్యూర్‌మెంట్ ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. ప్రభుత్వ పాఠశాలలు, రెసిడెన్షియల్ స్కూళ్లకు సంబంధించిన పెండింగ్ బిల్లులకు సంబంధించి పూర్తి వివరాలను అందించాలని అధికారులను ఆదేశించారు. ఈ సమీక్షలో ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్‌రెడ్డి, వేం నరేందర్‌రెడ్డి, స్పెషల్ సీఎస్ సబ్యసాచి ఘోష్, సీఎం సెక్రటరీ వేముల శ్రీనివాసులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.