13-01-2026 12:11:00 AM
ఎల్3 లబ్ధిదారులకు బిల్లులు మంజూరు
హైదరాబాద్, జనవరి 12 (విజయక్రాంతి) : ఇందిరమ్మ ఇండ్ల పథకంలో ఇంటి నిర్మాణ పనులు చేపట్టిన తర్వాత వివిధ కారణాల వల్ల ఆగిపోయిన ఎల్-3 లబ్ధిదారుల బిల్లులను విడుదల చేసినట్లు హౌసింగ్ కా ర్పొరేషన్ ఎండీ వీపీ గౌతమ్ తెలిపారు. కలెక్టర్ల నుంచి నివేదికలు తెప్పించుకున్న అనం తరం అర్హులైన 1.071 మంది లబ్ధిదారులకు రూ.12.17 కోట్లు విడుదల చేసినట్లు సోమవారం ఒక ప్రకటనలో ఆయన పేర్కొన్నారు. ఎల్ కేటగిరీలోని లబ్ధిదారుల బిల్లుల చెల్లిస్తామని స్పష్టం చేశారు.