8 బంతులకు 18 కోట్లా?
పతిరానాపై కేకేఆర్ ఫ్యాన్స్ ఫైర్
ముంబై, మే 24: శ్రీలంక క్రికెటర్ మతీశా పతీరానాపై కోల్‌కతా నైట్‌రైడర్స్ అభిమానులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. డెత్ ఓవర్ల స్పెషసిస్టుగా పేరున్న పతీరానా ను రూ.18 కోట్లు పెట్టి కేకేఆర్ కొనుగోలు చేసింది. అయితే ఐపీఎల్ ప్రారంభానికి ముందే గాయంతో బాధపడుతున్న పతీరానా 12 మ్యాచ్‌లకు దూరంగా ఉన్నాడు. గాయం నుంచి కోలుకున్న ఈ లంక పేసర్ గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన గత మ్యాచ్లో ఇంపాక్ట్ ప్లే యర్‌గా బరిలోకి దిగాడు.
గుజరాత్‌పై 8 బంతులు వేసిన అనంతరం పతీరానాకు కాలి పిక్క కండరాలు పట్టేయడంతో పెవిలియన్ చేరాడు. తాజాగా గాయం తీవ్రత ఎ క్కువగా ఉండడంతో పతీరానా కేకేఆర్ జట్టు ను వీడి స్వదేశానికి వెళ్లిపోయినట్లు ఆ జట్టు ఫ్రాంచైజీ తెలిపింది. ఐపీఎల్ నిబంధనల ప్రకా రం ఒక్క మ్యాచ్ ఆడినా ఆటగాడికి మొత్తం పారితోషికం చెల్లించాల్సిందే. ఈ లెక్కన పతీరానా సీజన్లో ఒక్క మ్యాచ్‌లోనే ఆడినప్పటికీ అతనికి రూ. 18 కోట్లు దక్కనున్నాయి.






