బ్రాండెడ్ పేరిట భారీ మోసం!
- ప్రైవేటు కంపెనీల మాయాజాలం
- మొలకెత్తని మొక్కజొన్న విత్తనాలు
- ఆందోళన చెందుతున్న రైతులు
కామారెడ్డి, డిసెంబర్ 9 (విజయక్రాంతి): ప్రైవేట్ కంపెనీల మాయాజాలానికి రైతులు బలవుతున్నారు. బ్రాండెడ్ కంపెనీల పేరిట రైతులకు అధిక ధరలకు విత్తనాలు అమ్ము తూ మోసం చేస్తున్నారు. కామారెడ్డి జిల్లా గాంధారి మండలం సర్వాపూర్‌కు చెందిన రైతు జైత్రం మంచి దిగుబడి వస్తుందని ఓ బ్రాండెడ్ కంపెనీకి చెందిన మొక్కజొన్న విత్తనాలు 27 బ్యాగులు గాంధారిలో కొన్నాడు. 7 ఎకరాల్లో విత్తనాలు నాటగా 23 బ్యాగుల వరకు మొలకెత్తలేదు.
వ్యవసాయ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. ప్రతి సంవత్సరం ఇలాంటి ఘటనలు అనేకం వెలుగు చూస్తున్నా అధికారులు కం పెనీలపై చర్యలు తీసుకోకపోవడంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ రైతు లు వ్యాపారిని నిలదీస్తే విత్తనాలు ఎలా నాటారు.. అంటూ గద్దిస్తున్నారు. దీంతో దిక్కుతోచని స్థితిలో రైతు మరింత అప్పుల పాలవుతున్నారు. నకిలీ విత్తన వ్యాపారుల ఆగడాలను అరికట్టాల్సిన అధికారులు వారి తో కుమ్మక్కై ప్రోత్సహం అందిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి.






