2 September, 2026 | 9:37 PM

Breaking News

పెరిక్స్ పై ఇన్కమ్ టాక్స్ రద్దుకు అంగీకరించిన యాజమాన్యం   •   రెవరెండ్ డాక్టర్ గుండెపాక వెంకన్నకు ది ఐకానిక్ ఇండియా అవార్డు   •   గంజాయి సాగుచేస్తున్న వ్యక్తిపై కేసు నమోదు   •   శేషగిరిరావును పరామర్శించిన జనసేన రాష్ట్ర నాయకులు డా గడల శ్రీనివాసరావు   •   నాలుగు క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం పట్టివేత   •   అక్రమ కేసులు ఎత్తివేయాలి: రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌. రామచందర్‌రావు   •   కాంగ్రెస్‌ 1000 రోజుల పాలనపై బీఆర్‌ఎస్‌ నిరసన   •   క్యాంప్ ఆఫీస్‌పై దాడి హేయమైన చర్య: ఎమ్మెల్యే కుంభం   •   మునిప‌ల్లి ఎస్సీ హాస్ట‌ల్‎ను త‌నిఖీ చేసిన చైర్మ‌న్, మండ‌ల ప్ర‌త్యేకాధికారి   •   పదవులు నా వెంట రావాలి.. భవిష్యత్ సీఎం నేనే!   •  

కోలా అంజన్ రావు కుటుంబానికి చేయూత

26-07-2025 | 03:33pm

తెలంగాణ మున్నూరు కాపు పటేల్స్ సంక్షేమ సంఘం

భద్రాద్రి కొత్తగూడెం,(విజయక్రాంతి): పాల్వంచ పట్టణ పరిధిలోని పాలకోయ తండా నివాసి మున్నూరు కాపు కులస్తుడు కోల అంజన్ రావు కుమారుడు కోలా సాయి చరణ్ 18 సంవత్సరాలు అనారోగ్యంతో శుక్రవారం మృతి చెందాడు. వారి కుటుంబం ఆర్థిక ఇబ్బందులలో ఉన్న విషయాన్ని సంఘ సభ్యులు తోట రామకృష్ణ తెలంగాణ మున్నూరుకాపు పటేల్స్ సంక్షేమ సంఘం అధ్యక్షులు కాంపెల్లి కనకేష్ పటేల్ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన కాంపెల్లి కనకేష్ పటేల్ తమ మున్నూరు కాపు సంఘం యొక్క వాట్సాప్ గ్రూప్ లో ఇట్టి విషయాన్ని తెలియ పరచగా గ్రూపు సభ్యులు 64 మంది స్పందించి తమ వంతుగా రూ.72,816/- విరాళాలు అందించారు. ఇట్టి డబ్బులను శనివారం సంఘ సభ్యులు అంజన్ రావు కుటుంబ సభ్యులకు అందజేశారు.

ఈ సందర్భంగా కాంపెల్లి కనకేష్ పటేల్ మాట్లాడుతూ మున్నూరు కాపు కులస్తులకు ఎటువంటి ఇబ్బందులు ఉన్న తమ దృష్టికి తీసుకువస్తే ఆ  సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని, ఇప్పుడు అంజన్ రావు కుటుంబానికి సహాయం చేసినట్లుగానే గతంలో జగన్నాధపురం గ్రామానికి చెందిన శ్రావణపు పెద్దులు కుటుంబానికి రూ.46203/- సోములగూడెం గ్రామానికి చెందిన పెద్దనీటి అనసూర్య కుటుంబానికి రూ.69000/- తమ సంఘ సభ్యుల ద్వారా విరాళాలు సేకరించి అందించడం జరిగిందన్నారు. మున్నూరు కాపు కులస్తులకు ఏమైనా సహాయం అవసరమైతే తెలియపరచగానే సంఘంలోని సభ్యులు స్పందించిన తీరు అద్భుతం అని, విరాళాలు అందించిన మున్నూరు కాపు సోదర, సోదరీమణులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.