26-07-2025 03:29:38 PM
భద్రాచలం,(విజయక్రాంతి): భద్రాచలం లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పేద విద్యార్థులకు చదువుల కోసం శనివారం ఆర్థిక సహాయం అందించారు. బీటెక్ చదువుతున్న భద్రాచలం చెందిన ముదిగొండ సాయి వినయ్, బూర్గంపాడు వాస్తవ్యుడు పాలని భానుచంద్ లతో పాటు ఏడవ తరగతి చదువుతున్న దువ్వపాటి నందకిషోర్ కి లైన్స్ క్లబ్ సభ్యుల సహకారంతో ఆర్థిక సహాయం అందజేశారు.
సుమారు రూ 35 వేలు ఆర్థిక సహాయం అందించగా, అందులో డాక్టర్ విశ్వ నారాయణ రూ 15వేలు, లయన్. ట్రెజరర్ ఎడ్లపల్లి రామారావు రూ 10 వేలు,మరో సభ్యులు కటుకూరి హరిబాబు రూ 10 వేలు అందజేశారు. ఆర్థిక సహాయం అందించిన సభ్యులకు భద్రాచలం లైన్స్ క్లబ్ తరఫున ధన్యవాదాలు తెలియజేశారు.