కిషన్‌రెడ్డికి కోమటిరెడ్డి, పొంగులేటి విషెస్
26-06-2024 01:38 AM
రాష్ట్రాభివృద్ధికి సహకరించాలని విజ్ఞప్తి
హైదరాబాద్, జూన్ 25 (విజయక్రాంతి): కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డికి రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న వీరు కిషన్ రెడ్డితో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. కిషన్ రెడ్డిని శాలువాతో సత్కరించారు. రాష్ట్రాభివృద్ధికి సహకరించాలని కోరారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులను ఎప్పటికప్పుడు విడుదల చేసేందుకు, కేంద్రం నుంచి కొత్త ప్రాజెక్టులు తీసుకువచ్చేందుకు సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు.






