ఫోన్ ట్యాపింగ్ కేసులో మూడో ఛార్జిషీట్!
26-06-2024 01:36 AM
కోర్టుకు సమర్పించిన పోలీసులు
హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 25 (విజయక్రాంతి) : రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలకపరిణామం చోటు చేసుకుంది. పోలీసులు మంగళవారం మూడో ఛార్జిషీట్ దాఖలు చేశారు. ఛార్జిషీట్‌తో పాటు సాక్ష్యాధారాలు ( హార్డ్ డిస్క్‌లు పెన్ డ్రైవ్‌లు, సీడీలు) న్యాయస్థానానికి సమర్పించారు. ఆధారాలను 3 పెట్టెల్లో నాంపల్లి కోర్టుకు తీసుకొచ్చిన పోలీసులు.. ఆధారాల గోప్యతకు తగు చర్యలు తీసుకోవాలని కోర్టును కోరినట్లు సమాచారం. ఇదిలా ఉండగా, ఈ కేసులో అరెస్టయి చంచల్‌గూడ జైలులో ఉన్న తిరుపతన్న, భుజంగరావు బెయిల్ పిటిషన్ విచారణను కోర్టు బుధవారానికి వాయిదా వేసింది.






