కొమురవెల్లి మల్లన్నకు రూ.18 లక్షల ఆదాయం
కొమురవెల్లి, ఏప్రిల్ 28: ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయంలో వివిధ విభాగాలకు చెందిన సీల్ కం బహిరంగ వేలం పాటలలో రూ.18 లక్షల 56 వేల 500 రూపాయలు ఆదాయం సమకూరింది. బుకింగ్ కార్యాలయం ముందు పూజా సామాగ్రి విక్రయించుకోవడానికి నిర్వహించిన వేలం పాటలో కొమురవెల్లి గ్రామానికి చెందిన చిక్కుడు స్వామి 17 లక్షలు హెచ్చు పాట పాడి టెండర్ను దక్కించుకున్నారు.
అనంతరం టీటీడీ కల్యాణ మండపం వద్ద గల షాపింగ్ కాంప్లెక్స్ లో షాపు నెంబర్ 15 కు నిర్వహించిన వేలం పాటలో ఎల్ నరేందర్ సంవత్సరాని రూ 88వేలు చొప్పున కిరాయి చెల్లించడానికి హెచ్చు పాట పాడి దక్కించుకున్నారు. అదేవిధంగా అన్నదాన సత్రం ముందుగాల షాప్ నంబర్ 4 నిర్వహించిన టెండర్లో సంవత్సరానికి రూ 68,500 కిరాయి చొప్పున హెచ్చు పాట పాడి షాపు దక్కించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వాహణాధికారి కృష్ణ ప్రసాద్, ఏ ఈ ఓ లు ఆర్ సుదర్శన్, బుద్ధి శ్రీనివాస్, పర్యవేక్షకులు నీల చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.






