29 April, 2026 | 2:45 AM

నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డును తరలించం

29-04-2026 01:29 AM
  1. కేంద్ర పశుసంవర్ధక మత్స్యశాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్
  2. రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి  విజ్ఞప్తి మేరకు స్పందించిన కేంద్ర మంత్రి
  3. పశుసంవర్ధక. మత్స్య శాఖలకు కేంద్రం నుండి నిధులను మంజూరు చేయాలని విజ్ఞప్తి వాకిటి శ్రీహరి

రాజేంద్రనగర్ ఏప్రిల్ 28 (విజయ క్రాంతి) : రాజేంద్ర నగర్ లోని నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డును ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడి నుండి తరలించబోమని కేంద్ర పశుసంవర్ధక . మత్స్య శాఖ మంత్రి రాజీవ్ రంజాన్ సింగ్ స్పష్టం చేశారు. మంగళవారం హైదరాబాదులోని రాజేంద్రనగర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో కేంద్ర మంత్రి రాజీవ్ రంజాన్ సింగ్ ను తెలంగాణ రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి మత్స్య శాఖ డైరెక్టర్ నిఖిల, పశు సంవర్ధక శాఖ అధికారి లక్ష్మీ నారాయణ తదితరులు కేంద్ర మంత్రుని కలిశారు.

పశు సంవర్ధక, పాడి, మత్స్య శాఖల్లో తెలంగాణ అమలు చేస్తున్న పథకాలను కేంద్రమంత్రికి  రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి వివరించారు. కేంద్రం నుంచి తెలంగాణకు సహకారం ఇవ్వాలని కేంద్రమంత్రిని వాకిటి శ్రీహరి విజ్ఞప్తి చేశారు అంతకు ముందు హైదరాబాద్‌కు  వచ్చిన కేంద్రమంత్రి రాజీవ్ రంజన్ సింగ్ ను మంత్రి వాకిటి శ్రీహరి శాలువా, పూల బోకే, మెమోటెంతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి వాకిటి శ్రీహరి కేంద్రమంత్రి తో మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో పశు సంవర్ధక, పాడి పారిశ్రామికాభివృద్ధి, మత్స్య శాఖల్లో అమలవుతున్న పథకాలు, వాటి ఫలితాల గురించి వివరించారు.

రాష్ట్రానికి కేంద్రం నుంచి కావలసిన సహకారం, ఆక్వా కల్చర్, లైఫ్ సైన్సెస్ లో ఇన్సూరెన్స్, మోపెడ్ కేటాయింపుల్లో న్యాయం చెయ్యాలని కోరగా కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించినట్లు మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. కేంద్ర ప్రభుత్వనిధులను రాష్ట్రాలకు సమానంగా పంచాలనీ మంత్రిని కోరారు. గోదావరి, కృష్ణా నదుల మధ్య ఉన్న 46 వేల పెద్ద చెరువులు, 26 వేల చిన్న చెరువులు, 100 రిజర్వాయర్ల అభివృద్ధి కోసం ప్రభుత్వం కృషి చేస్తుందనీ కేంద్ర మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ వాకిటి శ్రీహరికి వివరించారు.